మైకేల్ వాన్.. గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే! జాఫర్‌తోనా పెట్టుకునేది?

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న టీమిండియా‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. మూడు దశాబ్దాలుగా ఊరిస్తున్న సిరీస్‌ను అందుకోవడంలో కోహ్లీ కెప్టెన్సీలోని భారత్ మళ్లీ విఫలమైంది. శుక్రవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఓటమితో కోహ్లీ సేనకు చేదు అనుభవమే మిగిలింది.

ముఖ్యంగా మనకు ప్రధాన బలంగా భావించే బ్యాటింగ్‌లో వైఫల్యం టీమిండియా కొంపముంచింది. దీంతో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అవకాశం దొరికితే చాలు టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కే ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌ మళ్లీ తన నోటి దురదను తీర్చుకున్నాడు.

జాఫర్.. బానే ఉన్నావ్ కదా?

జాఫర్.. బానే ఉన్నావ్ కదా?

సౌతాఫ్రికా చేతిలో టీమిండియాకు ఎదురైన ఓటమిని ఎగతాళి చేసాడు. పోయి పోయి టీమిండియా మాజీ ఓపెనర్, సోషల్ మీడియా స్పెషలిస్ట్ వసీం జాఫర్‌ను గెలికాడు. ఇంకేముందు జాఫర్ గట్టిగానే ఇచ్చపడేసాడు. టీమిండియా ఓటమిని ఉద్దేశిస్తూ మైకేల్ వాన్.. 'గుడ్ ఈవ్‌నింగ్ వసీం జాఫర్‌!! నువ్వు బాగున్నావా? లేదా? చెక్ చేస్తున్నా' ఎటకారంగా ట్వీట్ చేశాడు. దీనికి వసీం జాఫర్ ఎప్పటిలానే మళ్లీ నోరెత్తకుండా అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిపడేశాడు.

మైకేల్ మంచిగానే ఉన్నా..

'మంచిగానే ఉన్న మైకేల్‌.. మర్చిపోకు... మీపై మేమే 2-1తో లీడ్‌లో ఉన్నాం.'అంటూ ఇంగ్లండ్ పర్యటన ఫలితాన్ని ఉద్దేశిస్తూ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. కాగా గతేడాది సెప్టెంబరులో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌ రెండింట నెగ్గి 2-1 తేడాతో ముందంజలో ఉంది. భారత శిబిరంలో కరోనా కలకలంతో ఆఖరి టెస్టు రద్దుకాగా... ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి.

IND vs SA:విరాట్ కోహ్లీ నోటి దురుద.. రిస్క్‌లో టెస్ట్ కెప్టెన్సీ!

గెలికి తన్నించుకోవడం అంటే..

గెలికి తన్నించుకోవడం అంటే..

అయితే మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య జరుగుతున్నఈ ట్వీటర్ వార్ ఇప్పటిది కాదు. చాలా రోజులుగా జరుగూతనే ఉంది. భారత్‌ను కించపరుస్తూ వాన్ వ్యాఖ్యానించిన ప్రతీసారి జాఫర్ తనదైన శైలిలో బదులిస్తూనే ఉంటాడు. ఇక తాజా రిప్లేపై భారత్ అభిమానులు సూపర్ అంటూ స్పందిస్తున్నారు. గెలికి మరి తన్నించుకోవడం అంటే ఇదేనని వాన్‌కు చురకలంటిస్తున్నారు. పోయి పోయి జాఫర్‌తో పెట్టుకున్నాడని, అతను అస్సలు వదలడని, ఇది ఇలానే కొనసాగుతుందని కామెంట్ చేస్తున్నారు.

యాషెస్ సిరీస్‌పై..

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ మైకేల్ వాన్‌కు వసీం జాఫర్ చురకలంటించాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు.. నాలుగో వన్డేలో 92 పరుగులకే ఆలౌటైంది. దాంతో వాన్ ట్విటర్ వేదికగా టీమిండియా వైఫల్యాన్ని ఎగతాళి చేశాడు. '92 పరుగులకే భారత్ ఆలౌట్.. ఈ రోజుల్లో కూడా 100 పరుగుల్లోపు ఓ జట్టు ఆలౌటవ్వడం నమ్మలేకపోతున్నా'అని ట్విటర్ వేదికగా ఏతులు కొట్టాడు.

అయితే యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్ట్‌లోనూ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అరంగేట్ర బౌల‌ర్ స్కాట్ బోలాండ్(6/7) ధాటికి 68 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీనిపై ఓ వీడియోను ట్వీట్ చేసిన జాఫర్.. అందులో తన మొబైల్‌లో మైకేల్ వాన్ చేసిన '100 పరుగుల్లోపు ఆలౌటవుతారా?'అని ట్వీట్‌ను చూపించాడు. ఈ వీడియోకు ఇంగ్లండ్ 68 ఆలౌట్ అనే క్యాప్షన్‌తో మైకేల్ వాన్‌కు ట్యాగ్ చేశాడు..ఈ వీడియో ట్వీట్ చూసిన వాన్.. తన తలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక.. 'వెరీ గుడ్ వసీం'అంటూ కవర్ డ్రైవ్ వేసాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, January 15, 2022, 13:04 [IST]
Other articles published on Jan 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X