For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోచ్‌ పదవికి వసీం జాఫర్‌ రాజీనామా! కారణం అదేనా?

Wasim Jaffer resigns as Uttarakhand head coach

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ టెస్ట్ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు. జాఫర్‌ ఏడాదిలోపే తన పదవికి రాజీనామా చేయడం విశేషం. ఫిబ్రవరి 20 నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ ప్రారంభంకానుండగా.. టోర్నీలో పాల్గొనేందుకు ఉత్తరాఖండ్ జట్టు బయలుదేరడానికి కొద్దిరోజుల ముందే జాఫర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జట్టు ఎంపికలో ఇతరులు జోక్యం చేసుకోవడంతోనే జాఫర్ కోచ్ పదవికి రాజీనామా చేశారని సమాచారం.

'ఇలా చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. ఉత్తరాఖండ్ జట్టు ఆటగాళ్లు చాలా సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. నా నుంచి చాలా నేర్చుకోగలరని నిజంగా నమ్మాను. కానీ అది జరగలేదు. ఎందుకంటే.. అర్హత లేని ఆటగాళ్ల కోసం జట్టు ఎంపిక విషయంలో అందరూ జోక్యం చేసుకున్నారు' అని వసీం జాఫర్ అసోసియేషన్‌కు రాసిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే ఉత్తరాఖండ్ కార్యదర్శి మహీమ్ వర్మ.. జాఫర్ వాదనలను తిరస్కరించారు. ఎంపిక విషయాలలో అతని జోక్యమే ఎక్కువగా ఉంటుందన్నారు. 2000వ సంవత్సరంలో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన జాఫర్‌.. 2008లో చివరి టెస్టు ఆడారు. జాఫర్ భారత్ తరపున 31 టెస్టులు, 2 వన్డేలను మాత్రమే ఆడారు.

అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత వసీం జాఫర్‌ గతేడాది మార్చిలో ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితులయ్యారు. అయితే ఏడాదిలోపే తన పదవికి రాజీనామా చేశారు. జాఫర్‌ రాజీనామాను ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయు) అంగీకరించింది. జాఫర్‌ ఆకస్మికంగా రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియదని, అయితే అతను మాత్రం కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు సీఏయు అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల ముగిసిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ ఘోర ప్రదర్శనతో నిరాశపరిచిన విషయం తెలిసిందే.

వసీం జాఫర్‌ గతేడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికారు. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించారు. రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్‌.. ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడారు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ జాఫర్‌ రికార్డు సృష్టించారు. తన క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్‌.. ఆ తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించారు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ జాఫర్‌ అరుదైన ఘనత అందుకున్నారు. 1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్‌.. మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19410 పరుగులు బాదారు. అందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి.

Story first published: Tuesday, February 9, 2021, 20:20 [IST]
Other articles published on Feb 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+