Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wasim Jaffer: ఇప్పుడు రిషబ్ పంత్ జట్టు కెప్టెన్ కానీ.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో బెంచ్‌కే పరిమితం

Wasim Jaffer predicted that Rishabh pant wont be in Indias playing 11 in T20 World cup

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దినేష్ కార్తీక్ ఆకట్టుకోగా.. కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం పేలవ ఫామ్ కనబర్చుతున్నాడు. ఇకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండానే భారత్ దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతుండగా.. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ గాయాల వల్ల ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఇక ఈ ఏడాది అక్టోబరు-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచ‌కప్ సమయానికి ఈ నలుగురు ఆటగాళ్లు టీమిండియా ప్లేయింగ్ XIలో కనిపించబోతున్నారు.

ఇక హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ కూడా తమ ప్రదర్శనలతో ఇటీవల ఆకట్టుకుంటుండడంతో వారిద్దరు కూడా టీ20 వరల్డ్ కప్ జట్టులో ప్లేయింగ్ 11లో ఆడే అవకాశముంది. ఇక వీరందరు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్‌ అప్పుడు ప్లేయింగ్ 11లో ఉండడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ వైపే ఎక్కువ మొగ్గు

రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ వైపే ఎక్కువ మొగ్గు

ఇక జాఫర్ మాట్లాడుతూ.. 'తదుపరి టీ20 వరల్డ్ కప్ జట్టును ఒకవేళ ఎంపిక చేసినట్లయితే అందులో డీకే తుది ప్లేయింగ్ 11లో తప్పకుండా ఉంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఫిట్‌గా ఉంటే కేఎల్ రాహుల్ తిరిగి జట్టు ప్లేయింగ్ 11లో ఆడతాడు. అతనితో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11లో ఉంటారు. కాబట్టి రిషబ్ పంత్ తుది జట్టులో స్థానం పొందడం కష్టమని నేను భావిస్తున్నాను' అని జాఫర్ ESPNcricinfoతో తెలిపాడు.

దినేష్ కార్తీక్ తన ఫామ్ కొనసాగించడంతో రిషబ్ పంత్‌ కంటే అతనే బెటర్ అనే ఫీలింగ్ తీసుకొచ్చాడని నేను భావిస్తున్నా. ఇక మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేను. కానీ ప్రస్తుతానికైతే రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ వీరిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని అడిగితే తప్పకుండా దినేష్ కార్తీక్‌నే ఎంపిక చేస్తారు,' జాఫర్ పేర్కొన్నాడు.

తొలి మ్యాచ్‌లో రాణించాడు కానీ..

తొలి మ్యాచ్‌లో రాణించాడు కానీ..

ఇకపోతే ఈ సిరీస్లో తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 29పరుగులతో మంచి టచ్‌లో కన్పించిన పంత్.. తదుపరి మూడు మ్యాచ్‌లలో 5, 6, 17 స్కోర్లతో ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇకపోతే ఆదివారం బెంగళూరు వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదోది, మరియు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం 2-2తో సిరీస్ సమం కావడంతో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకం కానుంది.

బెంచ్ ప్లేయర్‌గా రిషబ్ పంత్

బెంచ్ ప్లేయర్‌గా రిషబ్ పంత్

ఇకపోతే వసీం జాఫర్ వ్యాఖ్యలను బట్టి చూస్తే టీ20 ప్రపంచకప్ టీమిండియా స్క్వాడ్‌లో రిషబ్ పంత్ బెంచ్ ప్లేయర్‌గా మాత్రమే ఉంటాడని స్పష్టమవుతుంది. టీమిండియా కెప్టెన్ పగ్గాలు చేపట్టిన ప్లేయర్ ఇక బెంచ్ ప్లేయర్‌గా మారబోతుండడం కాస్త అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే చర్య కావొచ్చు. అందువల్ల జట్టు మేనేజ్ మెంట్ ఎలాంటి సెలక్షన్ చేస్తుందో మరీ. ఇకపోతే జాఫర్ వ్యాఖ్యలు, ఇతర ప్రముఖుల వ్యాఖ్యల బట్టి టీ20 వరల్డ్ కప్ ఇండియా ప్లేయింగ్ 11 ఒకసారి అంచనా వేస్తే..

(ప్లేయింగ్ 11) తుది జట్టు అంచనా

(ప్లేయింగ్ 11) తుది జట్టు అంచనా

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్రా జడేజా, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

స్క్వాడ్లో మిగతా ప్లేయర్లు

సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యార్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి.

Story first published: Sunday, June 19, 2022, 17:25 [IST]
Other articles published on Jun 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+