న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఎంఎస్ ధోనీ మాత్రమే అలా చేయగలడు.. నాయకుడు అంటే అతడే!!

Wasim Jaffer praises MS Dhoni For Delaying His Departure Till All CSK Players Leave

హైదరాబాద్: ఎంఎస్ ధోనీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా, క్రికెటర్‌గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన ఏకైక సారథి కూడా. తన కూల్ కెప్టెన్సీతో భారత జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చాడు. గొప్ప నాయకుడు అయిన మహీ.. మైదానంలోనే కాదు బయట కూడా సహచర ఆటగాళ్లకు అండగా నిలుస్తుంటాడు. తాజాగా ఇది మరోసారి నోరూపితమైంది. ఐపీఎల్ 2021ని బీసీసీఐ నిరవధిక వాయిదా వేసినా.. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు అందరూ ఇళ్లకు చేరుకున్నాకే తాను ఇంటికి వెళతానని ధోనీ చెప్పాడు.

టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడమే మంచిది! కోల్‌కతా పేసర్ సంచలన వ్యాఖ్యలు!టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడమే మంచిది! కోల్‌కతా పేసర్ సంచలన వ్యాఖ్యలు!

పలు జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ని మంగళవారం వాయిదా వేసింది. అన్ని జట్ల క్రికెటర్లు, సారథులు అందుబాటులో ఉన్న వసతులతో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం బాధ్యతాయుతంగా ఆఖరి వరకూ హోటల్‌లో ఉండి.సహచరుల ప్రయాణ ఏర్పాట్లని పర్యవేక్షించాడు. మొదటగా టీమ్‌లోని విదేశీ క్రికెటర్ల ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చిన మహీ.. ఆ తర్వాత భారత క్రికెటర్ల ప్రయాణ ఏర్పాట్లని సమీక్షించాడట. ఈ క్రమంలో చెన్నై టీమ్ బస చేసిన హోటల్ నుంచి చివరిగా వెళ్లింది ధోనీనే.

ఆటగాళ్ల తరలింపునకి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఛార్టర్ ప్లైట్‌ని వినియోగించింది. రెండో అంచె మ్యాచులు ఆడడానికి ఢిల్లీలో ఉన్న చెన్నై జట్టు అక్కడి నుంచి రాజ్‌కోట్, ముంబై, బెంగళూరు, చెన్నైకి ఆటగాళ్లని తరలించింది. అందరూ బయలుదేరాక గురువారం రాత్రి ఎంఎస్ ధోనీ రాంచీకి బయల్దేరి వెళ్లాడు. చెన్నై ఆటగాళ్లు సురక్షితంగా వెళ్లే వరకూ హోటల్‌లోనే మహీ ఉండటంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'పని పూర్తయ్యే వరకూ ఎంఎస్ ధోనీ అక్కడే ఉన్నాడు. ఇలా ధోనీ మాత్రమే చేయగలడు. నాయకుడు అంటే అలా ఉండాలి' అని జాఫర్ కితాబిచ్చాడు.

'చెన్నై జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లంతా వారి దేశాలకు వెళ్లిపోయేంతవరకు నేను హోటల్‌ రూంలో ఉంటాను. వారు సురక్షితంగా ఇంటికి చేరారు అనే వార్త విన్న తర్వాత నేను రాంచీ ఫ్లైట్‌ ఎక్కుతా. నా జట్టులో ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని నేనే కావాలి. ఇప్పటికే దీనికి సంబంధించి జట్టు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడి అనుమతి కోరాను' అని ఎంఎస్ ధోనీ తనకు వివరించినట్లు ఓ సీఎస్‌కే ఆటగాడు చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021లో సీఎస్‌కే అద్భుతంగా రాణించింది. లీగ్ నిలిచిపోయిన సమయానికి ఆడిన 7 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకుని పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Story first published: Friday, May 7, 2021, 18:28 [IST]
Other articles published on May 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X