ఆల్‌టైమ్ అత్యుత్తమ వన్డే జట్టు.. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ!!

ముంబై: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ సముచిత గౌరవాన్ని కల్పించాడు. తన ఆల్‌టైమ్ వన్డే అత్యుత్తమ జట్టును తాజాగా వసీం జాఫర్ ట్విట్టర్లో వెల్లడించాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియాకు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన రికీ పాంటింగ్‌లు ఉన్నప్పటికీ.. ధోనీకే సారథ్య బాధ్యతలను అప్పగించడం విశేషం. ఇటీవల వెల్లడించిన ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ జట్టుకు కూడా కెప్టెన్‌గా మహీకే జాఫర్ ఓటేశాడు.

నలుగురు టీమిండియా ఆటగాళ్లకు అవకాశం:
వసీం జాఫర్ తన అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. అయితే ఒక్క భారత బౌలర్‌ను కూడా ఎంపిక చేయలేదు. ఓపెనర్లుగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ప్రస్తుత ప్లేయర్ రోహిత్ శర్మను ఎంచుకున్నాడు. వన్‌డౌన్ కోసం విరాట్ కోహ్లీని కాకుండా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవీఎన్ రిచర్డ్స్ వైపు మొగ్గు చూపాడు. అయితే కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని జాఫర్ చెప్పాడు.

కెప్టెన్‌గా ధోనీ:
మిడిలార్డర్ పటిష్టపరచడానికి దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్, కెప్టెన్‌గా ధోనీని ఎంచుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ మాజీ సారథి వసీం అక్రమతో పాటు జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్లలో సక్లాయిన్ ముస్తాక్, షేన్ వార్న్‌లలో పరిస్థితికి తగ్గట్టు ఎవరినో ఒకరు తుది జట్టులో ఉంటాడని తెలిపాడు. అయితే రికీ పాంటింగ్‌ను 12వ ఆటగాడిగా జాఫర్ ఎంపిక చేశాడు.

వసీం జాఫర్ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే:
ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎన్ రిచర్డ్స్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, వసీం ఆక్రమ్, జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్, సక్లాయిన్ ముస్తాక్/షేన్ వార్న్, రికీ పాంటింగ్ (12వ ఆటగాడు).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications