Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వసీం జాఫర్‌ కొత్త ఇన్నింగ్స్‌.. హెడ్ కోచ్‌గా బాధ్యతలు!!

Wasim Jaffer Appointed Head Coach Of Uttarakhand

ముంబై: ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. ఉత్తరాఖండ్‌ క్రికెట్ జట్టు హెడ్‌ కోచ్‌గా అతడు నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది దేశవాళీ సీజన్‌ కోసం సంవత్సర కాలానికి జట్టుకు కోచ్‌గా ఉండనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా జాఫరే పీటీఐ వార్త సంస్థకు మంగళవారం వెల్లడించాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్లో కొనసాగిన జాఫర్‌ ఈ ఏడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

 మొదటిసారి కోచ్‌గా పనిచేయబోతున్నా:

మొదటిసారి కోచ్‌గా పనిచేయబోతున్నా:

మొదటిసారి కోచ్‌గా పనిచేయనున్న వసీం జాఫర్‌ మాట్లాడుతూ... 'మొదటిసారి ఒక జట్టుకు కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి నాకు ఇప్పుడు కొత్తగాను, ఒక చాలెంజింగ్‌ అనిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక ఆటగాడిగా సేవలందించిన నేను ఇక జట్టును తీర్చిదిద్దేపనిలో ఉండడం అదృషంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్‌ జట్టు నాకు కొత్తైనా వారి ప్రదర్శన బాగుంది. 2018-19 రంజీ సీజన్‌లో ఆ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌లో విదర్భతో తలపడి ఓడిపోయింది. దీంతో వారు గ్రూఫ్‌-డి (ప్లేట్‌ గ్రూఫ్‌కు) పడిపోయారు. ప్రస్తుతం గ్రూఫ్‌-డిలో ఉన్న ఉత్తరాఖండ్‌ జట్టును టాప్‌లో నిలపడమనేది నా ముందున్న లక్ష్యం' అని తెలిపాడు.

సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా:

సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా:

'ఇప్పుడున్న తరుణంలో జట్టును కింద నుంచి పైస్థానానికి తీసుకురావడం అనేది కోచ్‌గా అనుభవాన్ని నేర్పిస్తుంది. జట్టులో మంచి టాలెంటెడ్‌ ఆటగాళ్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారిని మరింత రాటు దేల్చడమే నా లక్ష్యం. స్వతహగా నేను ముంబై, విదర్భ జట్లకు ఆడేటప్పుడు ఉత్తరాఖండ్‌ జట్టును పరిశీలించా. గత ఐదారేళ్లలో క్రికెట్‌లోకి వచ్చిన ఎంతో మంది యువకులకు ఆటలో మెళుకువలు ఇస్తూ వారికి మార్గ నిర్దేశనం చేశా. ప్రస్తుతం కోచ్‌ అవకాశం రావడంతో మరింత మంది యువకులకు నా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా' అని జాఫర్‌ పేర్కొన్నాడు.

31 టెస్టులు.. 1,944 పరుగులు:

31 టెస్టులు.. 1,944 పరుగులు:

వసీం జాఫర్‌ ఈ ఏడాది మార్చిలో ఆటకు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించాడు. రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్‌.. ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ జాఫర్‌ రికార్డు సృష్టించాడు.

 తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత:

తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత:

తన క్రికెట్‌ కెరీర్‌లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన వసీం జాఫర్‌.. ఆ తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ జాఫర్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. 1996-97 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం చేసిన జాఫర్‌.. మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు బాదాడు. అందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉన్నాయి.

నా దేశం గొప్పదని నినాదాలు చేస్తే లాభం లేదు.. మాటలతో పాటే నడవాలి: ఇర్ఫాన్‌

Story first published: Wednesday, June 24, 2020, 7:12 [IST]
Other articles published on Jun 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+