Wasim Jaffer's All Time IPL Playing 11: టీంలో రోహిత్, డివిలియర్స్, వార్నర్‌ను పట్టించుకోని జాఫర్, జట్టు ఇదే..

భారత మాజీ బ్యాటర్, క్రికెట్ విశ్లేషకుడు వసీం జాఫర్ తన ఆల్ టైమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయింగ్ XIటీంను ప్రకటించాడు. 31 టెస్ట్ మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన జాఫర్.. 34.11సగటుతో 1944పరుగులు చేశాడు. తరచూ క్రికెట్ విషయాలపై తన అభిప్రాయాలను జాఫర్ పంచుకుంటాడు. తన విశ్లేషణలతో పాటు ఫన్నీ రియాక్షన్స్ కూడా పోస్టు చేస్తుంటాడు. తాజాగా ఆల్ టైం ఐపీఎల్ ప్లేయింగ్ 11 టీంను జాఫర్ ప్రకటించగా.. ఉద్ధండులైన క్రికెటర్లను జట్టులో పేర్కొన్నాడు.

ఓపెనర్లు వారిద్దరే
ఓపెనర్లుగా యునివర్శల్ బాస్ క్రిస్ గేల్, కేఎల్ రాహుల్‌లను ఎంచుకున్నాడు. వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడతో రాణించిన ఓపెనర్లుగా పేరుపడ్డ సంగతి తెలిసిందే. గేల్ ఐపీఎల్లో 142గేమ్‌లు ఆడగా, రాహుల్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 109మ్యాచ్‌లు ఆడాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2022 సీజన్లో ప్లేఆఫ్ వరకు తన జట్టును తీసుకెళ్లాడు. అలాగే 600కు పైచిలుకు పరుగులు చేశాడు. ఇక గేల్ సైతం ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు.

ధోనీ జట్టు కెప్టెన్‌గా
ఇక వసీం జాఫర్ ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు కప్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను కాదని ఎంఎస్ ధోనీని తన జట్టు కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఇకపోతే జాఫర్ మిడిల్ ఆర్డర్‌లో మాజీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా, ఎంఎస్ ధోనీలను తన బ్యాటర్లుగా పేర్కొన్నాడు. జట్టు వికెట్ కీపర్ కం కెప్టెన్ రోల్‌లో ధోనీ వ్యవహరిస్తాడని జాఫర్ పేర్కొన్నాడు. ఇకపోతే ఈ ముగ్గురు ప్లేయర్లు ఏళ్ల తరబడి తమ ఫ్రాంఛైజీల తరఫున అత్యుత్తమ కంట్రిబ్యూషన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎస్కేకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరిస్తుండగా.. ఆర్సీబీ ప్లేయర్ గా కోహ్లీ ఉన్నాడు. ఇక రైనాను ఈ సీజన్లో ఎవరూ కొనలేదు.

పటిష్ఠమైన బౌలింగ్ విభాగం
ఆల్‌రౌండర్ విభాగంలో వసీం జాఫర్ ఆండ్రీ రస్సెల్, హార్దిక్ పాండ్యాలను ఎంచుకున్నాడు. వీరిద్దరు భారీ హిట్టర్లనే సంగతి తెలిసిందే. ఇక బౌలింగ్లో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగలను పేర్కొన్నాడు. ఇక మరో స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ లేదా యుజ్వేంద్ర చాహల్‌లలో ఎవరో ఒకరిని తీసుకుంటానని చెప్పాడు.
రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్.. ఎన్నో మ్యాచ్‌లలో తమ బౌలింగ్‌తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. బుమ్రా, లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ తరఫున ఆడారు. బుమ్రా ప్రస్తుతం ముంబైకి స్టార్ పేసర్ గా కొనసాగుతుండగా.. మలింగ రాజస్థాన్ జట్టు బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నాడు.

వీళ్లను అసలు పట్టించుకోలేదు
ఇకపోతే జాఫర్ ఐపీఎల్లో ఘన చరిత్ర ఉన్నటువంటి కొందరు ప్రముఖుల పేర్లను మర్చిపోయాడు. సన్ రైజర్స్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌ను అతను జట్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే మరో విధ్వంసక ప్లేయర్, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను పక్కనపెట్టాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మను, ఓపెనర్‌గా రాణించే శిఖర్ ధావన్‌ను పట్టించుకోలేదు. ఆల్రౌండర్లయిన డీజే బ్రావో, కీరన్ పొలార్డ్‌లను అసలు లెక్కపెట్టలేదు.

వసీం జాఫర్ IPL ప్లేయింగ్ XI టీం:
క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ / యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications