
అంతర్జాతీయ మ్యాచ్‌లను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు:
టీమిండియా పూర్తి స్థాయిలో చివరగా ఆడిన సిరిస్ ఇంగ్లండ్‌పైనే. గత మార్చిలో ఇంగ్లండ్‌తో ఆడిన వన్డే, టీ20 సిరీసే చివరిది. ఇదే విషయాన్ని పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రస్తావించాడు. ఎ స్పోర్ట్స్‌లో అక్రమ్ మాట్లాడుతూ... 'భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చివరగా పూర్తి స్థాయిలో ఆడింది మార్చి నెలలో. ఇది నవంబరు మాసం. అప్పటినుంచి ఇప్పటివరకూ అందరు ఆటగాళ్లూ కలిసి ఒక్క అంతర్జాతీయ టోర్నీ కూడా ఆడలేదు. దీన్నిబట్టే అంతర్జాతీయ క్రికెట్‌ను భారత్ ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో మనకు అర్థమైపోతోంది. కేవలం ఐపీఎల్ ఆడితే చాలని భారత్ భావిస్తోంది' అని విమర్శించాడు. పాకిస్తాన్ తరఫున అక్రమ్ 101 టెస్టులు, 356 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 414, వన్డేల్లో 502 వికెట్లు పడగొట్టిన అక్రమ్.. అప్పుడప్పుడూ తన వ్యాఖ్యానంతో అలరిస్తుంటాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం:
జూలై నెలలో శ్రీలంక పర్యటనకు భారత జట్టు వెళ్లిన విషయం తెలిసిందే. లంకకు వెళ్లిన జట్టులో సీనియర్ ప్లేయర్లెవరూ లేరు. ప్రధాన ఆటగాళ్లు లేకుండా యువ జట్టును శ్రీలంకకు పంపింది బీసీసీఐ. అదే సమయంలో సీనియర్ ప్లేయర్స్ ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడారు. ఆ వెంటనే ఆటగాళ్లంతా యూఏఈ వచ్చి ఐపీఎల్ 2021లో ఆడారు. అనంతరం రెండు రోజుల వ్యవధిలో మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 మొదలైపోయింది. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన మనోళ్లు.. అసలు సమరంలో మాత్రం తేలిపోయారు. ఈ విషయాన్నే పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ప్రస్తావించాడు. లీగ్ మ్యాచ్‌లు ఎన్ని ఆడినా.. అంతర్జాతీయ మ్యాచ్‌తో సమానం కాదని అక్రమ్ పేర్కొన్నాడు. 'లీగ్ దశలో ఒకరో ఇద్దరో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొంటాం. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అలాకాదు. ఐదుగురు అద్భుతమైన బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని అన్నాడు.

రోహిత్‌ను మూడో స్థానంలో దింపుతారా:
న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మను మూడో స్థానంలో దింపడాన్ని కూడా వసీం అక్రమ్ తప్పుబట్టాడు. 'టీ20 క్రికెట్‌లో మూడు సెంచరీలు చేసిన ఓపెనర్‌ను ఇలాంటి కీలకమైన మ్యాచ్‌లో మూడో స్థానంలో దింపుతారా? ఇషాన్ కిషన్‌నే ఆ స్థానంలో దింపొచ్చు కదా. భారత్ పెద్ద పొరపాటు చేసింది' అని అక్రమ్ అన్నాడు. న్యూజిల్యాండ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత టీమిండియా సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఈ క్రమంలోనే భారత జట్టు మనస్తత్వాన్ని, తప్పుడు నిర్ణయాలను అభిమానులే కాక మాజీలు కూడా తప్పుబడుతున్నారు.


Click it and Unblock the Notifications












