తప్పు చేశావ్ బాబర్.. నీ మిస్టేకే పాక్ కొంపముంచింది..! పాక్ ఓటమిపై వసీం అక్రమ్ రియాక్షన్

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమికి గల ప్రధాన కారణాన్ని వసీమ్ అక్రమ్ వెల్లడించాడు. బాబర్ ఆజామ్ చేసిన కీలక తప్పిదమే పాక్ ఓటమికి కారణమయిందని పేర్కొన్నాడు. ఇకపోతే ఆదివారం చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. 148పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన తర్వాత.. పాక్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాక్ బౌలర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. ఇకపోతే పాక్ బౌలర్లలో నవాజ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అతను తన స్పిన్ మాయాజాలంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఒకే రీతిలో ఔట్ చేసి పాకిస్థాన్‌కు బ్రేక్ ఇచ్చాడు.

నవాజ్ చేత ఆఖరి ఓవర్లో బౌలింగ్
ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ తన ఓవర్ల కోటాలో మిగిలిన ఒక్క ఓవర్‌ను చివరి ఓవర్లో వేయాల్సిన పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేని బాబర్ ఆజామ్ అతనికి లాస్ట్ ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్ క్రీజులో ఉండడంతో భారత్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసుకుని ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అక్రమ్.. ఆఖరి ఓవర్‌లో నవాజ్ చేత బౌలింగ్ చేయించి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పెద్ద తప్పు చేశాడని చెప్పాడు.

జడేజా, హార్దిక్ లాంటి హిట్టర్లు ఉండగా సబబు కాదు
'ఈ తరహా టీ20 పిచ్ అంటే నాకు ఇష్టం. బౌలర్లు బౌన్సర్లు బౌల్ వేయగలిగారు. ఇరు వైపులా బౌలర్లు వికెట్లు తీయగలిగారు. ఇది నాకు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఇది ఒక మంచి క్రికెట్ గేమ్. చివరి ఓవర్ వరకు ఫైట్ సాగింది. అయితే బాబర్ ఒక తప్పు చేశాడు. అతను నవాజ్ బౌలింగ్‌ను 13వ లేదా 14వ ఓవర్లో వేయించాల్సింది. అయితే ఒక ఓవర్ ఆపి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. చివరి 3, 4 ఓవర్లలో స్పిన్నర్ చేత బౌలింగ్ వేయడం టీ20ల్లో ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా లాంటి హిట్టర్లు బరిలో ఉండగా ఈ తరహా బౌలింగ్ చేయించడం సబబు కాదు.' అని అక్రమ్ పేర్కొన్నాడు.

పాక్ ఫాస్ట్ బౌలింగ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది
ఇకపోతే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. అక్రమ్ పాకిస్తాన్ బౌలింగ్ లైనప్‌ను ప్రశంసించాడు. కఠినమైన పరిస్థితుల్లో పాక్ బౌలర్లు చేసిన కృషిని ప్రశంసించాడు. 'నవాజ్ చాలా తెలివైన బౌలర్. అతను స్ట్రెయిటర్ బౌలింగ్లో నైపుణ్యం కనబరిచాడు. ఫలితంగా బ్యాటర్లపై ఎడ్జ్ కలిగి ఉన్నాడు. ఏదేమైనా ఫలితాన్ని స్వీకరించాలి. వెల్ డన్ ఇండియా. హార్దిక్, జడేజా గేమ్‌ని గెలిపించారు. వారికి అభినందనలు. పాకిస్థాన్ బౌలర్ దహానీ చాలా ఆకట్టుకున్నాడు. అతని 3వ లేదా 4వ గేమ్ ఆడుతున్న అతని ఇంటెన్సిటీ బాగుంది. అలాగే నసీమ్ షా 20ఏళ్ల వయస్సులో తన మొదటి గేమ్‌లోనే అదరగొట్టాడు. హరీస్ రవూఫ్ నిలకడగా బౌలింగ్ చేశాడు. ప్రతి బౌలర్ తమ శాయశక్తులా ప్రయత్నించాడు. ఫాస్ట్ బౌలింగ్‌కు సంబంధించినంత వరకు పాకిస్తాన్‌కు భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని ఈ మ్యాచ్ ద్వారా అర్థమవుతుంది' అని అక్రమ్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications