Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ ఆట‌తీరుపై వ‌సీమ్ అక్ర‌మ్ షాకింగ్ కామెంట్స్‌!

ICC Cricket World Cup 2019 : Wasim Akram Hopes Pak Can Repeat 1992 Performance v New Zealand
Wasim Akram hopes Pakistan can repeat 1992 performance vs New Zealand

లండ‌న్‌: స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ నేతృత్వంలోని పాకిస్తాన్ జ‌ట్టు బుధ‌వారం కీల‌క‌మైన మ్యాచ్‌ను ఆడ‌బోతోంది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టిదాకా ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడిపోని న్యూజీలాండ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌బోతోంది. బ‌ర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో అవ‌మాన‌క‌ర ఓట‌మి అనంత‌రం కోలుకున్న పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు.. బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాను ఓడించింది. సెమీ ఫైన‌ల్‌కు వెళ్లే ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన ద‌క్షిణాఫ్రికా ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే.

జ‌ట్టులో మార్పులొద్దు:

జ‌ట్టులో మార్పులొద్దు:

బ‌ర్మింగ్ హామ్‌లో న్యూజీలాండ్‌తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టులో ఎలాంటి మార్పులు చేయ‌కూడ‌ద‌ని మాజీ కేప్టెన్ వ‌సీం అక్ర‌మ్ సూచించారు. ద‌క్షిణాఫ్రికాపై ఆడిన జ‌ట్టుతోనే కివీస్‌నూ ఢీ కొట్టాల‌ని అన్నారు. ఏ ఒక్క‌ర్ని తొల‌గించినా ఆట‌గాళ్ల ఆత్మ‌విశ్వాసం దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు. 1992లో పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు రెండుసార్లు న్యూజీలాండ్‌ను ఓడించింద‌ని, దాన్నే పున‌రావృతం చేయాల‌ని అన్నారు. 1992 నాటి ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో లీగ్ మ్యాచ్‌లో ఒక‌సారి, సెమీ ఫైన‌ల్‌లో మ‌రోసారి కివీస్ టీమ్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఫ‌లితంగా- ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్ జ‌ట్టు ఇంగ్లండ్‌ను ఓడించి ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆవిర్భ‌వించింది. పాకిస్తాన్‌తో మ్యాచ్ ఎదుర్కొనేంత వ‌ర‌కూ న్యూజీలాండ్ నాటి టోర్న‌మెంట్‌లో ఒక్క మ్యాచ్‌ను కూడా ఓడిపోలేదు.

ఫీల్డింగ్‌లో లోపాలు ఉన్నాయి..

ఫీల్డింగ్‌లో లోపాలు ఉన్నాయి..

పాకిస్తాన్ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించిన‌ప్ప‌టికీ.. ఫీల్డింగ్‌లో లోపాలు ఉన్నాయ‌ని వ‌సీం అక్ర‌మ్ అభిప్రాయ‌ప‌డ్డారు. వాటిని స‌రిదిద్దుకోవాల్సి ఉంటుంద‌ని సూచించారు. ప్ర‌త్యేకించి- క్యాచ్‌ల‌ను ప‌ట్టే సమ‌యంలో ఆట‌గాళ్ల‌లో తొట్రుపాటు క‌నిపిస్తోంద‌ని అన్నారు. ఫ‌లితంగా- క్యాచ్‌ల‌ను జార‌విడుస్తున్నార‌ని, దీనివ‌ల్ల మ్యాచ్ ఫ‌లితం తారుమారయ్యే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు. ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో పాకిస్తాన్ ఇప్ప‌టిదాకా మొత్తం 14 క్యాచ్‌ల‌ను నేల‌పాలు చేసింద‌ని గుర్తు చేశారు. ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఏ జ‌ట్టుకైనా క్యాచ్‌ల‌ను జార‌విడవ‌డం మంచిది కాద‌ని అన్నారు.

విరాట్ కోహ్లీని అధిగ‌మించే సామ‌ర్థ్యం..

విరాట్ కోహ్లీని అధిగ‌మించే సామ‌ర్థ్యం..

పాకిస్తాన్ వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ప్ర‌పంచ స్థాయిలో నాణ్య‌మైన ఆట‌గాడ‌ని వ‌సీం అక్ర‌మ్ కితాబు ఇచ్చారు. 50 ల‌ను సెంచ‌రీలుగా మార్చుకోవ‌డానికి కావాల్సిన సామ‌ర్థ్యం అత‌నిలో ఉన్నాయ‌ని చెప్పారు. అలా చేయ‌గలిగితే అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడ‌ని అన్నారు. విరాట్ కోహ్లీని అధిగ‌మించే సామ‌ర్థ్యం బాబ‌ర్ ఉంద‌ని అన్నారు. పాకిస్తాన్ జ‌ట్టు భారీ స్కోరు చేయాలంటే బాబ‌ర్ ఆజ‌మ్ త‌న వ్య‌క్తిగ‌త స్కోరును మెరుగు ప‌ర‌చుకోవాల్సి ఉంటుంద‌ని అర్ధ సెంచ‌రీ సాధించిన ప్ర‌తీసారీ దాన్ని సెంచ‌రీగా మ‌ల‌చుకోవడానికి అత‌ను ప్ర‌య‌త్నించాల‌ని సూచించారు.

Story first published: Tuesday, June 25, 2019, 14:09 [IST]
Other articles published on Jun 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+