Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తనలాంటి యాక్షన్: పాక్ చిన్నారికి వసీం అక్రమ్ పాఠాలు (వీడియో)

Wasim Akram coaches Pakistani kid with similar action, see pic

హైదరాబాద్: ఈ నెల మొదట్లో ఆరేళ్ల బుడతడు తన ఇంటిపై అద్భుతంగా బౌలింగ్‌ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. 'అచ్చం వసీం అక్రమ్‌ లాగా బౌలింగ్‌ చేస్తున్నాడు' అంటూ నెటిజన్లు ట్విట్టర్‌లో కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న ఫైజాన్‌ అనే వ్యక్తి ఈ వీడియోను వసీం అక్రం ట్విటర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేశాడు.

ఈ వీడియోని వీక్షించిన వసీం అక్రమ్ 'ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు. అతనిలో చాలా ప్రతిభ ఉంది. ఇలాంటి వారికి శిక్షణ ఇస్తే మన దేశం గర్వపడేలా అద్భుతాలు చేస్తారు' అని ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత వసీం అక్రమ్ పాకిస్థాన్‌లోని చిచ్చవట్ని ప్రాంతానికి చెందిన హాసన్‌ అక్తర్‌ గురించి వివరాలు సేకరించాడు.

ఆ చిన్నా్రికి తానే స్వయంగా శిక్షణ కూడా ఇవ్వడం ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్రమ్‌ ట్విట్టర్ ద్వారా సోమవారం అభిమానులతో పంచుకున్నాడు. 'నేను చెబుతున్న విషయాలను హాసన్‌ ఎంతో ఏకాగ్రతతో వింటున్నాడు. ఔట్‌ స్వింగ్‌, ఇన్‌ స్వింగ్‌ వేయడానికి బంతిని ఎలా పట్టుకోవాలో కూడా హాసన్‌కు తెలుసు. ఆశ్చర్యపోయాను. హాసన్‌తో ఎంతో విలువైన సమయం గడిపాను. ఇంత తక్కువ వయస్సులోనే అతని వద్ద అసాధారణ ప్రతిభ ఉంది. హాసన్‌ చిచ్చవట్ని ప్రాంతానికి చెందినవాడు' అని అక్రమ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 27, 2018, 14:21 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+