Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్‌కప్‌లో ధోని అనుభవం టీమిండియాకు అవసరం: అక్రమ్

Dhoni Must Play In 2019 World Cup : Every Cricketer Feels About Dhoni | Oneindi Telugu
Wasim Akram backs MS Dhoni to play 2019 World Cup

హైదరాబాద్: ఈమధ్య కాలంలో ధోని ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో సైతం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో ఆస్ట్రేలియా సిరిస్‌కు ధోనిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆసీస్‌తో మూడు టీ20లకు ధోని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్ కోసం సెలక్టర్లు ఇంకా జట్టుని ప్రకటించలేదు. ఈ వన్డే సిరిస్‌లో గనుక ధోనికి ఎంపిక కాకపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో చోటు దక్కడం కష్టమే.

ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని

ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని

ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనిని ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అభిమానులు చూడలేరు. అయితే, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ధోని తప్పక ఆడాలని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సూచించాడు.

ఫామ్ అనేది తాత్కాలికం

ఫామ్ అనేది తాత్కాలికం

ఇండియా టీవికి ఇచ్చిన ఇంటర్యూలో "ఫామ్ అనేది తాత్కాలికం అని, క్లాస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి, వచ్చే వరల్డ్‌కప్‌లో ధోనిని చూడాలని అనుకుంటున్నా. ధోని ఓ మ్యాచ్ విన్నర్, అతడిలో ఇంకా క్రికెట్ ఉందని నేను భావిస్తున్నా, ఇంగ్లాండ్‌లో జరిగే వరల్డ్ కప్‌లో ధోని అనుభవం టీమిండియాకు అవసరం" అని అన్నాడు.

 ధోని తప్పక ఫామ్ అందుకుంటాడు

ధోని తప్పక ఫామ్ అందుకుంటాడు

రెండు రోజుల క్రితం మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం వరల్డ్‌కప్ నాటికి టీమిండియా మహేంద్ర సింగ్ ధోని తప్పక ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లక్ష్మణ్ మాట్లాడుతూ "ధోని దిగ్గజ ఆటగాడు. 2019 వరల్డ్‌కప్‌లో అతడు జట్టులో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని నా నమ్మకం. క్రికెట్ ప్రపంచంలో ఇప్పటికీ ధోనీనే అత్యుత్తమ వికెట్ కీపర్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతడు ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు" అని అన్నాడు.

 2019 వరల్డ్‌కప్‌లోనూ ధోని

2019 వరల్డ్‌కప్‌లోనూ ధోని

"2018 ఐపీఎల్ సీజన్‌లో ధోని బ్యాటింగ్‌ నన్ను ఆకట్టుకుంది. చాలా స్వేచ్ఛగా ఆడాడు. అతను అలా ఆడితే, ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. 2019 వరల్డ్‌కప్‌లోనూ ధోని తన సహజసిద్ధమైన ఆట ఆడితే తప్పక రాణిస్తాడు. ఇందుకోసం అతడు ముందే ఫామ్‌ను అందుకోవాల్సి ఉంటుంది" అని లక్ష్మణ్ వెల్లడించాడు.

Story first published: Wednesday, November 28, 2018, 17:39 [IST]
Other articles published on Nov 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+