Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెలెక్టర్ల వల్లే నా కొడుకు కెరీర్ నాశనం: వాషింగ్టన్ సుందర్ తండ్రి అసహనం!

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టును పరాజయం నుంచి కాపాడి అద్భుత సెంచరీతో మెరిసిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి మణి సుందర్ టీమిండియా సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన కొడుకు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ అతడిని నిరంతరం పక్కన పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

మాంచెస్టర్ టెస్టులో సుందర్ సూపర్ సెంచరీ
మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ చివరి రోజున టీమిండియా ఓటమి అంచున నిలిచింది. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వంటి కీలక బ్యాటర్లు వెంటవెంటనే ఔటైన తర్వాత, రవీంద్ర జడేజాతో కలిసి వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లండ్ బౌలర్ల ధాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, జట్టును ఓటమి ప్రమాదం నుంచి తప్పించి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. ఈ కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ కేవలం 206 బంతుల్లోనే 101 పరుగులు చేసి తన టెస్ట్ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ సెంచరీ జట్టుకు చాలా విలువైనది.

Washington Sundar s Father Slams Selectors Over Unfair Treatment

ఇది ఎలాంటి న్యాయం?.. మణి సుందర్ ఆవేదన
వాషింగ్టన్ సుందర్ తండ్రి మణి సుందర్ తన కొడుకు పట్ల జరుగుతున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మణి సుందర్ మాట్లాడుతూ.. "వాషింగ్టన్ సుందర్ ప్రతీసారి అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ అతడి సామర్థ్యాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఇతర ఆటగాళ్లకు నిరంతరం అవకాశాలు ఇస్తున్నారు. నా కొడుకు మాత్రం కొన్ని మ్యాచ్‌లలో సరిగ్గా ఆడకపోయినా వెంటనే జట్టు నుంచి తొలగిస్తున్నారు. ఇది ఎలాంటి న్యాయం?" అని ప్రశ్నించారు.

ఇది మొదటి సారి కాదని ఆయన గుర్తు చేశారు. "2021లో చెన్నై, అహ్మదాబాద్‌లలో ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా స్పిన్నర్లకు అనుకూలమైన పిచ్‌లపై వాషింగ్టన్ సుందర్ 85, 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లలో అతను సెంచరీ చేసి ఉన్నా, తదుపరి మ్యాచ్‌లో అతన్ని తొలగించేవారేమో. మరే ఇతర భారతీయ ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితి ఎదురై ఉంటుందా? ఈ నిరంతర నిర్లక్ష్యం అతన్ని మానసికంగా మరింత బలపరిచింది, దాని ఫలితాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు" అని ఆయన ఆగ్రహంగా అన్నారు. సుందర్ కెరీర్‌లో ఎదురైన ఈ చేదు అనుభవాలు అతన్ని మరింత దృఢంగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌లోనూ అన్యాయం.. గుజరాత్ టైటాన్స్ జట్టుపై విమర్శలు
జాతీయ జట్టులోనే కాకుండా ఐపీఎల్ టోర్నీలో కూడా తన కొడుకుకు అన్యాయం జరుగుతోందని మణి సుందర్ పేర్కొన్నారు. "వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టులో కూడా అతనికి నిరంతరం అవకాశాలు ఇవ్వడం లేదు. గత ఐపీఎల్ 2025 సీజన్‌లో 15 మ్యాచ్‌లలో కేవలం 6 మ్యాచ్‌లలో మాత్రమే అతనికి అవకాశం లభించింది.ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 24 బంతుల్లో 48 పరుగులు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు యశస్వి జైస్వాల్‌ను ఎలా ప్రోత్సహిస్తుందో చూడండి. అలాంటి మద్దతు నా కొడుకుకు దేశవాళీ క్రికెట్‌లో కూడా లభించలేదు." అని మణి సుందర్ ఆరోపించారు.

వాషింగ్టన్ సుందర్ తండ్రి చేసిన ఈ ఆరోపణలు భారత క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్ సుందర్ సాధించిన అద్భుతమైన సెంచరీ, ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. భారత జట్టు ఎంపిక కమిటీ ఇకనైనా వాషింగ్టన్ సుందర్ సామర్థ్యాన్ని గుర్తించి, అతనికి తగిన అవకాశాలను కల్పిస్తుందా అనేది చూడాలి.

Story first published: Tuesday, July 29, 2025, 12:46 [IST]
Other articles published on Jul 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+