బుడ్డోడిలో ఆ దమ్ముంది.. నా రికార్డు బ్రేక్ చేస్తాడు: స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో అత్యంత కీలక విషయం క్లారిటీ అని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నారు. స్టేడియంలోకి వెళ్లే ముందే ప్రతి ఆటగాడికి తన బాధ్యత ఏంటో.. కెప్టెన్ తన నుంచి ఏం ఆశిస్తున్నాడో గిల్ చాలా స్పష్టంగా వివరిస్తాడని సుందర్ చెప్పుకొచ్చాడు. ఈ విధానం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా తమ సహజసిద్ధమైన ఆటను ఆడగలుగుతున్నారని పేర్కొన్నాడు.
వైభవ్ సూర్యవంశీ ప్రతిభ
భారత క్రికెట్‌లో ప్రస్తుతం సెన్సేషన్‌గా మారిన బీహార్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ గురించి వాషింగ్టన్ సుందర్ గొప్పగా మాట్లాడాడు. టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా తన పేరిట ఉన్న రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. వైభవ్ వయసు తక్కువైనా అతని ఆలోచనా విధానం, నైపుణ్యం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందని, అతడు భవిష్యత్తులో టీమిండియాకు సుదీర్ఘ కాలం ఆడుతాడని వాషింగ్టన్ సుందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

గుజరాత్ టైటాన్స్ డ్రెస్సింగ్ రూమ్
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు, గుజరాత్ టైటాన్స్ డ్రెస్సింగ్ రూమ్‌కు పెద్దగా తేడా ఏమీ లేదని సుందర్ తెలిపాడు. ఇక్కడ ఆటగాళ్లందరి మధ్య మంచి సమన్వయం ఉందని, జట్టులోని భారతీయ ఆటగాళ్లంతా టీమిండియాలో కూడా కలిసి ఆడిన వారు కావడంతో ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసని చెప్పాడు. కేవలం మైదానంలోనే కాకుండా టీమ్ రూమ్‌లో కూడా అందరం కలిసి ఎక్కువ సమయం గడపడం వల్ల ఓ కుటుంబంలా కలిసిపోయామని, ఈ వాతావరణమే గుజరాత్ టైటాన్స్ జట్టును ప్రత్యేకంగా నిలుపుతుందని పేర్కొన్నాడు.
కోచ్ ఆశిష్ నెహ్రా గైడెన్స్
కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ గొప్ప అనుభూతినిస్తుందని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. గత నాలుగేళ్లుగా గుజరాత్ జట్టుతో నెహ్రాకు ఉన్న అనుబంధం అద్భుతమని, ఆయన ఆటగాళ్ల బలాలు, బలహీనతలను చాలా సులభంగా అర్థం చేసుకుంటారని కొనియాడాడు. ఐపీఎల్ తన జీవితాన్ని మార్చివేసిందని, 2017లో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు ఒక దశాబ్దానికి చేరువవుతోందని, సీనియర్ ఆటగాడిగా తన బాధ్యతలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని వాషింగ్టన్ సుందర్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications