Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

County Championship: కౌంటీల్లో లంకాషైర్ టీం తరఫున అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్

Washington Sundar Debut For Lancashire Team in County Championship

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్‌తో తలపడేందుకు గ్లెన్ చాప్ల్ సారథ్యంలోని 13మంది సభ్యుల లంకాషైర్ టీంకు వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యాడు. లంకాషైర్ తరఫున అతను అరంగేట్రం చేశాడు. వాషింగ్టన్ శనివారం మాంచెస్టర్‌కు చేరుకున్నాడు. డివిజన్ వన్ క్లాష్‌కు ముందు తన టీం సభ్యులతో కలిసి ప్రాక్టీసు సెషన్ కోసం వాంటేజ్ రోడ్‌కి వెళ్లాడు. '22ఏళ్ల ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఆగస్ట్ 2న ప్రారంభమయ్యే కౌంటీ ఛాంపియన్ షిప్‌తో పాటు రాయల్ లండన్ వన్డే కప్ మొత్తానికి అందుబాటులో ఉంటాడు' అని లాంకాషైర్ అధికారికంగా ప్రకటించింది.

హాంప్‌షైర్ హాక్స్‌తో ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్ ఫైనల్‌లో 4వికెట్లు పడగొట్టిన లెగ్-స్పిన్నర్ మాట్ పార్కిన్సన్ ఇటీవల ఇంగ్లాండ్‌ తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరిగే వైట్ బాల్ సిరీస్‌లో జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఉన్నారు. మంగళవారం కొత్త కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన సాకిబ్ మహమూద్ సైతం వెన్ను ఒత్తిడి పగుళ్లతో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇక ప్రస్తుతం నార్తాంప్టన్ షైర్‌తో తలపడేందుకు సిద్ధంగా ఉన్న లంకాషైర్ జట్టును ఓసారి పరిశీలిస్తే..

లంకా‌షైర్ క్రికెట్ జట్టు: డేన్ విలాస్, టామ్ బెయిలీ, జార్జ్ బాల్డర్సన్, జోష్ బోహన్నన్, స్టీవెన్ క్రాఫ్ట్, కీటన్ జెన్నింగ్స్, రాబ్ జోన్స్, జాక్ మోర్లీ, మాట్ పార్కిన్సన్, వాషింగ్టన్ సుందర్, ల్యూక్ వెల్స్, విలియమ్స్, ల్యూక్ వుడ్.

Story first published: Tuesday, July 19, 2022, 17:25 [IST]
Other articles published on Jul 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+