
హైదరాబాద్: భారత జట్టులో యువ క్రికెటర్లు వరుసగా అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఏడాది వ్యవధిలోనే భారత వన్డే జట్టులో నలుగురు క్రికెటర్లు అరంగేట్రం చేశారు. 2019 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లకు అవకాశాలను కల్పించడంతో పాటు రిజర్వ్ బెంచ్‌ని కూడా బలోపేతం చేస్తోంది.
ఇందులో భాగంగా మొహాలి వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన రెండో వన్డేలో తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ అరంగేట్రం చేశాడు. తద్వారా వాషింగ్టన్ సుందర్ అరుదైన ఘనత సాధించాడు. అతి చిన్న వయసులో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న ఏడో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందుండగా, మణిందర్ సింగ్, హర్భజన్ సింగ్, పార్థీవ్ పటేల్, శుక్లా, చేతన్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
పిన్న వయసులో భారత క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:
* Sachin Tendulkar - 16 years 238 days
* Maninder Singh - 17 years 222 days
* Harbhajan Singh - 17 years 288 days
* Parthiv Patel - 17 years 301 days
* Laxmi Ratan Shukla - 17 years 320 days
* Chetan Sharma - 17 years 338 days
* Washington Sundar - 18 years 69 days
రెండో వన్డేలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేసిన 220వ క్రికెటర్‌గా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. వాషింగ్టన్ సుందర్‌కి భారత జట్టు కోచ్ రవిశాస్త్రి టీమిండియా టోపీ ఇచ్చి జట్టులోకి ఆహ్వానించాడు.
ఈ ఏడాది మొత్తంగా కుల్దీప్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ ఇలా నలుగురు యువ క్రికెటర్లు వన్డేల్లో భారత్ తరుపున అరంగేట్రం చేశారు. గత ఆదివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.