For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సుందర్ బిందాస్‌గా ఆడుకో: టీమిండియా హెడ్ కోచ్

Washington’s astonishing story continues

హైదరాబాద్: 'బిందాస్‌గా ఆడుకో' 'భయపడకు' అంటూ రవిశాస్త్రి భారత టీ20 జట్టు యువ ఆటగాడైన వాషింగ్టన్ సుందర్‌కు ఉత్తేజాన్ని ఇచ్చేవాడట. శ్రీలంకతో సిరీస్‌ ముగిసిన తర్వాత స్వరాష్ట్రానికి చేరుకున్న అతడు భారత జట్టుతో కలిసి ఆడిన తన అనుభవాలను మీడియాకు ముచ్చటించాడు.

ప్రస్తుత భారత జట్టు ఆటగాళ్లలో యువ ఆటగాడైన వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రంలోనే తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. అటు వన్డేల్లో ఇటు టీ20ల్లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో తనకు కోచ్ రవిశాస్త్రి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభించేదని చెప్పుకొచ్చాడు.

ఓ సారి టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి తనకు వన్డే జట్టు టోపీని అందిస్తూ బిందాస్‌ (భయం లేని) క్రికెట్‌ ఆడాలని సూచించినట్టు వాషింగ్టన్‌ తెలిపాడు. 'అదే మాటను నాతో శాస్త్రి సర్‌ రెండు వారాల్లో కనీసం ఆరుసార్లు పదం చెప్పి ఉంటారు. నేను భయపడకుండా క్రికెట్‌ను ఆస్వాదించాలని కోరుకున్నారు.' అని వివరించాడు.

'భారత జట్టు నన్ను స్థిమిత పరిచింది. ఆత్మవిశ్వాసంతో ఉండాలని శాస్త్రి సర్‌ ఎప్పుడూ చెప్పేవారు. నా సహజమైన ఆటను ప్రదర్శించాలని బౌలింగ్‌ కోచ్‌ బి.అరుణ్‌ కోరుకున్నారు. తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ నాపై ఎంతో నమ్మకం ఉంచారు' అని అన్నాడు.

అరంగేట్రం మ్యాచ్‌లోనే సుందర్‌కు రోహిత్‌ తొలి ఓవర్‌ వేయమని బంతినిచ్చాడు. ఆరు పవర్‌ప్లే ఓవర్లలో మూడు వేయించాడు. 18 పరుగులిచ్చిన సుందర్‌.. కుశాల్‌ పెరీరా వికెట్‌ తీశాడు. పెరీరా ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ అందుకున్నాడు. విశాఖ అంటే తనకిష్టమని, అస్వస్థతకు గురికావడంతో అక్కడ వన్డే ఆడలేకపోయానని అన్నాడు

తన వయసులో ఉన్న వాళ్లు టీమిండియాకు ఎంపికై ఎంఎస్‌ ధోనీ లాంటి సీనియర్‌తో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నారంటే వారి కల నిజమైనట్టే లెక్క కదా అంటూ తన విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. అతి పిన్న వయసులోనే (18 ఏళ్ల 80 రోజులు) టీమిండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన వ్యక్తిగా సుందర్‌ రికార్డు సృష్టించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 27, 2017, 17:04 [IST]
Other articles published on Dec 27, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+