అమెరికా వేదికగా జరిగిన మేజర్ క్రికెట్ లీగ్-2024లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఛాంపియన్‌గా అవతరించింది. శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌తో జరిగిన ఫైనల్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటింది. ఏకపక్షంగా సాగిన తుదిపోరులో వాషింగ్టన్ 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ విధ్వంసం సృష్టించాడు. 52 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా మాక్స్‌వెల్ కూడా చెలరేగాడు. మాక్సీ 22 బంతుల్లో 40 పరుగులు చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ తుదిపోరులో నిరాశపరిచాడు. తొమ్మిది పరుగులకే ఔటయ్యాడు.

ఆండ్రిస్ గౌస్ (21; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. శాన్‌ఫ్రాన్సిస్కో బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీశాడు. కాగా, అనంతరం ఛేదనలో శాన్ ఫ్రాన్సిస్కో 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్రామీ (20; 19 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర) టాప్ స్కోరర్. మార్కో జేన్సన్, రచిన్ రవీంద్ర చెరో మూడు వికెట్లు, ఆండ్రూ టై రెండు వికెట్లు పడగొట్టాడు.
ఛేదనలో శాన్‌ఫ్రాన్సిస్కో ఏ దశలోనూ పోరాటపటిమ చూపలేదు. మూడో ఓవర్‌లో జేక్ ఫ్రేజర్ (3; 6 బంతుల్లో) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టారు. 53 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్స్ ఓటమి అంతరాన్ని తగ్గించారు. కాగా, స్టీవ్ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.