Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అయ్యో ధావన్‌కు ఎంత కష్టమొచ్చే.. కర్ర పట్టుకొని మరీ టాయ్‌లెట్‌ కడిగించిన ఆయేషా (వీడియో)!!

Washing clothes, cleaning washroom: Shikhar Dhawan shares life in isolation in hilarious video


ఢిల్లీ: మహమ్మరి కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమే ఆగిపోతే.. క్రీడాలోకం పూర్తి‌గా స్థంభించింది. వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా జరగాల్సిన కొన్ని క్రీడా ఈవెంట్లు రద్దు కాగా.. మరికొన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎటువంటి క్రికెట్ టోర్నీలు లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. అయితే క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Watch : Shikhar Dhawan Washing Clothes & Cleaning Toilet During Isolation
టాయ్‌లెట్‌ కడిగిన ధావన్‌:

టాయ్‌లెట్‌ కడిగిన ధావన్‌:

టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కూడా కూడా కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ధావన్‌ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిలో ఎక్కువ రోజులు ఇంట్లో ఉంటే భర్త ఎదుర్కొనే పరిస్థితులను సరదాగా చూపిస్తూ వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ధావన్‌ బట్టలు ఉతుకుతుండగా.. తన భార్య ఆయేషా ముఖర్జీ మేకప్‌ వేసుకున్నారు. ఆ తర్వాత ఆయేషా ఫోన్‌ మాట్లాడుతూ కర్ర పట్టుకొని ధావన్‌తో బలవంతంగా టాయిలెట్‌ కడిగించింది.

ధావన్‌కు ఎంత కష్టమొచ్చే:

ధావన్‌కు ఎంత కష్టమొచ్చే:

ప్రస్తుతం ఈ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు. అయ్యో ధావన్‌కు ఎంత కష్టమొచ్చే అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. కరోనా సెలవులను ధావన్ ఎంజాయ్ చేస్తున్నాడు అని మరో అభిమాని కామెంట్ చేసాడు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రతి భర్త పరిస్థితి ఇలాగే ఉందని నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఇక భారత టెన్నిస్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ కూడా నవ్వుతున్న ఎమోజీలను కామెంట్‌ చేసింది.

 క్వారంటైన్‌లో ధావన్!!

క్వారంటైన్‌లో ధావన్!!

భారత కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో శిఖర్ ధావన్ కూడా క్వారంటైన్‌ (నిర్బధం)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే ధావన్ జర్మనీకి వెళ్ళాడు. జర్మనీ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఢిల్లీకి చేరిన ధావన్ నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో చేరాడు. అలాగే అక్కడి పరిస్థితిని వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా:

చేతి వేలి గాయం కారణంగా 2019 వన్డే ప్రపంచకప్‌ నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ (రాజ్‌కోట్ వన్డే) గాయపడ్డాడు. ప్రపంచకప్‌ నుంచి ధావన్ గాయపడడం నాలుగోసారి. గాయాల కారణంగా గబ్బర్ గత సంవత్సర కాలంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కోలుకున్న గబ్బర్ దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికయినా.. వర్షం, కరోనా కారణంగా మూడు వన్డేలు రద్దయ్యాయి.

Story first published: Wednesday, March 25, 2020, 9:52 [IST]
Other articles published on Mar 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+