క్రికెట్, బాలీవుడ్ రంగాల మధ్య బలమైన బంధం ఉంది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - షర్మిలా ఠాగూర్ నుంచి విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ - అతియా శెట్టి వరకు చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ రెండు రంగాలకు చెందిన ప్రముఖులు కలిసి కనిపిస్తే, వారి మధ్య ఏదో నడుస్తోందన్న ఊహాగానాలు, పుకార్లు రావడం సహజం. సచిన్ టెండూల్కర్, శిల్పా శిరోద్కర్ విషయంలో కూడా అదే జరిగింది. 90వ దశకంలో, క్రికెట్ దేవుడిగా అభిమానులచే పిలవబడే సచిన్ టెండూల్కర్‌తో బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ ప్రేమలో ఉన్నారని ఒక పుకారు వచ్చింది. అయితే, దీని వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకుందాం.
పుకార్ల వెనుక ఉన్న కథ
ఒకప్పుడు "క్రికెట్ దేవుడు"గా అభిమానులచే పిలవబడే సచిన్ టెండూల్కర్, నటి శిల్పా శిరోద్కర్‌తో ప్రేమలో ఉన్నారని మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఆ సమయంలో సచిన్ ఇంకా వివాహం చేసుకోలేదు, కానీ అంజలి మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే, వారి సంబంధం గురించి అప్పట్లో ఎవరికీ తెలియదు. అదే సమయంలో శిల్పా శిరోద్కర్ కూడా సింగిల్‌గా ఉండటంతో, ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని ఊహాగానాలు మొదలయ్యాయి.

పుకార్లు ఎలా మొదలయ్యాయి?
శిల్పా శిరోద్కర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. 1991లో తాను 'హమ్' సినిమా చేస్తున్న సమయంలో సచిన్‌ను కలిశానని ఆమె చెప్పారు. తన కజిన్ బ్రదర్, సచిన్ ముంబైలోని బాంద్రా ఈస్ట్‌లో కలిసి క్రికెట్ ఆడేవారని, ఆ పరిచయం ద్వారానే తాను సచిన్‌ను కలిశానని ఆమె వివరించారు. అయితే శిల్పా ప్రకారం, ఆ సమయంలో సచిన్, అంజలి మెహతా ఇప్పటికే డేటింగ్ లో ఉన్నారు. కానీ ఆ విషయం ప్రజలకు తెలియదు. "నేను సచిన్‌ను కేవలం ఒక్కసారి మాత్రమే కలిశాను. ఒక నటి, ఒక క్రికెటర్ కలిసినప్పుడు, ముఖ్యంగా అది సచిన్ టెండూల్కర్ కాబట్టి, పుకార్లు రావడం చాలా సులభం" అని ఆమె చెప్పారు. తాను, సచిన్ కేవలం స్నేహితులు మాత్రమేనని శిల్పా స్పష్టం చేశారు.
సచిన్ టెండూల్కర్ స్పష్టత
ఈ పుకార్లపై సచిన్ టెండూల్కర్ కూడా ఒక సందర్భంలో స్పందించారు. తన గురించి వచ్చిన అత్యంత హాస్యాస్పదమైన పుకారు ఏంటని అడిగినప్పుడు, "నేను, శిల్పా శిరోద్కర్ ప్రేమించుకుంటున్నామని వినడం అత్యంత హాస్యాస్పదమైన విషయం" అని ఆయన బదులిచ్చారు. ఈ ఒక్క ప్రకటనతో ఆయన ఆ పుకార్లకు పూర్తిగా ముగింపు పలికారు.
వారి వివాహం, జీవితం
సచిన్ టెండూల్కర్ 1995లో అంజలి మెహతాను వివాహం చేసుకొని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నారు. శిల్పా శిరోద్కర్ కూడా 2000లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అపరేష్ రంజిత్‌ను వివాహం చేసుకొని ఒక కూతురితో ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరు తమ జీవితాల్లో సంతోషంగా ఉన్నారు. పెళ్లి తర్వాత విదేశాల్లో స్థిరపడిన శిల్ప.. ఇటీవల మళ్లీ నటించడం ప్రారంభించారు. పెళ్లి తర్వాత సినిమాలకు విరామం తీసుకుని విదేశాల్లో స్థిరపడిన శిల్ప శిరోద్కర్.. ఇటీవల బిగ్ బాస్ 18 ద్వారా తిరిగి నటించడం ప్రారంభించారు.
అనిల్ కపూర్‌తో కూడా ఎఫైర్!
శిల్పా శిరోద్కర్ పేరు సచిన్ టెండూల్కర్‌తో పాటు హీరో అనిల్ కపూర్‌తో కూడా ముడిపడింది. మీడియా నివేదికల ప్రకారం.. ఒకప్పుడు వారిద్దరూ డేటింగ్ చేసుకున్నారు. అయితే నటి మాధురీ దీక్షిత్ కారణంగా వారి మధ్య బంధం చెడిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించబడలేదు. తన కెరీర్ ప్రారంభంలో అనిల్ కపూర్ తనకు చాలా సహాయం చేశారని.. దర్శకులకు, నిర్మాతలకు పరిచయం చేశారని శిల్ప శిరోద్కర్ స్వయంగా అంగీకరించారు.