సెలక్టర్ల ఒత్తిడి మేరకే ధోని తప్పుకున్నాడా?: ఎమ్మెస్కే స్పందన
హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రానున్న వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసేందుకు వీలుగా ధోని తనకు తానుగా వైదొలగాడని మాజీ క్రికెటర్లు ధోని నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే.
అయితే ధోని తాను స్వయంగా ఈ నిర్ణయం తీసుకోలేదని అతనిపై సెలక్టర్లు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు మద్దతుగా బీసీసీఐలోని కొందరు పెద్దలు సైతం వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, జార్ఖండ్ జట్ల మధ్య నాగ్‌పూర్‌లో రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోని వద్దకు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు.

కోహ్లీ సిద్దంగా ఉన్నాడు
కెప్టెన్సీని అందుకునేందుకు కోహ్లీ సిద్దంగా ఉన్నాడని, తాను ఇప్పటికే నిరూపించుకున్నాడని ధోనీని తప్పుకోవాల్సిందిగా నచ్చచెప్పాడని జాతీయ మీడియాలో వచ్చిన వార్తల సారాంశం. 2019లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు ధోనికి 39 సంవత్సరాలు వచ్చేస్తాయని, హడావుడిగా కోహ్లీకి కెప్టెన్సీ అప్పచెప్పడం మంచిదని వివరించాడట.

తప్పుకోవాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నాడు
దీంతో ధోని అప్పటికప్పుడు ధోని పరిమిత ఓవర్ల కెప్టన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. దీంతో ధోని కెప్టెన్సీ వీడ్కోలు ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు.

ధోనితో ఈ విషయాన్ని చర్చించిన మాట వాస్తవమే
రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ సందర్భంగా తాను ధోనితో ఈ విషయాన్ని చర్చించిన మాట వాస్తవమేనని ఓ స్పోర్ట్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్ తెలిపారు.

ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోని చెప్పాడు
ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని అన్నారు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను సైతం ఆశ్చర్యపరిచిందని తెలిపారు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా కోహ్లీని ధోని గైడ్ చేయాల్సిన సమయమిదని ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications