Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బర్త్ డే పార్టీలో ధోనీ వెనుక సిగరెట్‌తో.. పాండ్యా

Dhoni Fans Critisises Hardik Pandya For HIS Activity In Sakshi's Party | Oneindia Telugu
Was Hardik Pandya smoking something at Sakshi Dhonis birthday party? Fans think so

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య 30వ పుట్టినరోజును సన్నిహితుల సమక్షంలో ఒకరోజు ముందుగానే జరుపుకున్నారు. సాక్షి పుట్టినరోజు నవంబరు 19కాగా ప్రత్యేక కారణాల రీత్యా ఆదివారమే జరిపారు. ఈ బర్త్ డే పార్టీకి టీమిండియా క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా ఒక్కడే హాజరైయ్యాడు. ఇప్పటికే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం బ్రిస్బేన్ చేరుకోవడంతో అందుబాటులో ఉన్న పాండ్యా మాత్రమే పార్టీలో మెరిశాడు. తల్లి పుట్టినరోజు పార్టీలో కూడా జీవానే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో పాండ్య తీరు

సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో పాండ్య తీరు

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సతీమణి సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో హార్దిక్ పాండ్య వ్యవహరించిన తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ముంబైలో అట్టహాసంగా ఆదివారం జరిగిన సాక్షి 29వ పుట్టిన రోజు వేడుకకి వచ్చిన హార్దిక్ పాండ్య.. ఆమె కేక్ కట్ చేస్తుండగా.. వెనుక సిగరెట్ తాగుతూ కనిపించాడు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

దీనికి సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ వెనుక.. అదీ.. అతని సతీమణి పుట్టిన రోజు వేడుకల్లో ప్రముఖుల మధ్య సిగరెట్ తాగిన హార్దిక్ పాండ్యాపై ఇప్పుడు ధోనీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌ మొత్తానికి దూరమైయ్యాడు.

ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో.. పక్కకి

ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో.. పక్కకి

నవంబరు 21 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనకీ హార్దిక్ ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో.. అతడ్ని పక్కన పెట్టేశారు సెలక్టర్లు. ఆల్‌రౌండర్ కోటాలో కృనాల్ పాండ్యాని టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఆసీస్ గడ్డపై భారత్ జట్టు మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుండగా.. టీ20 జట్టు నుంచి ధోనీ తప్పించి రిషబ్ పంత్‌కి వికెట్ కీపర్‌గా సెలక్టర్లు ఛాన్సిచ్చిన విషయం తెలిసిందే.

పాండ్యా లేకపోవడం జట్టులో లోపమే.

పాండ్యా లేకపోవడం జట్టులో లోపమే.

ఈ పర్యటనలో హార్దిక్ పాండ్యా లేకపోవడం జట్టులో లోపమే. అతను ఉంటే సమతూకంగా ఉండేదని కోచ్ రవిశాస్త్రి శాస్త్రి పేర్కొన్నాడు. టీమిండియా పటిష్టంగా ఉందని ఈ సారి ఆస్ట్రేలియా గడ్డపై తమ ప్రత్యేకత చాటుకుంటామని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 19, 2018, 17:39 [IST]
Other articles published on Nov 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+