వాళ్లు నన్ను ఔట్ చేయలేరని ఫిక్స్ అయిపోయా: రోహిత్ శర్మ

హైదరాబాద్: మొహాలీ వేదికగా బుధవారం భారత్ శ్రీలంకల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధాన కోచ్ రవిశర్మతో కలిసి మాట్లాడాడు. 'నేను మైదానంలో ఉన్నంత సేపు నేను ఔట్ అవ్వాలే కానీ, నా వికెట్ తీయలేరని ఫిక్స్ అయిపోయా. నా వల్ల అయినంత వరకు బ్యాటింగ్ చేస్తూనే ఉండాలి' అని విజయ గర్వంతో మాట్లాడాడు.
బుధవారం జరిగిన భారత్ శ్రీలంక వన్డేలో రోహిత్ 208 స్కోరును చేసి మూడో సారి డబుల్ సెంచరీ చేసిన విషయం విదితమే. మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను ధావన్ మ్యాచ్‌కు ముందే మాట్లాడుకున్నాం. పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. ముందు మనం నిలదొక్కుకోవాలి. తర్వాత పరుగుల గురించి ఆలోచిద్దాం. మేం అలానే చేశాం. ఆటలో భాగస్వామ్యం చాలా కీలకం" అని వెలిబుచ్చాడు.
ఇంకా, శ్రీలంక జట్టు కుడి, ఎడమ రెండు వైపులా చాలా కట్టుదిట్టమైన ఫీల్డింగ్ పెట్టారన్నాడు. ఒకే బౌలర్ చేతుల మీదుగా వచ్చే బంతులను మేము తరచూ అటూ ఇటూ మారుతూ ఉండటం బాగా కలిసొచ్చిందని వివరించాడు.
ఈ 3 సెంచరీలు చేయడానికి రోహిత్ చాలా కష్టపడాల్సి వచ్చిందన్నాడు. వీటిని చేసిన ప్రతిసారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మొదటిది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆడి 264 పరుగులను, రెండోసారి, మూడో సారి శ్రీలంకతోనే ఆడి సాధించానన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్ ఆడే ముందు అతని వేలికి గాయమైందని అసలు పరుగులు చేయగలనో లేదో అని భయపడ్డానని తెలిపాడు. చివరకి ఇంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా గెలిచామని విజయోత్సాహంతో పలికాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications