చేతికి వేసుకున్న పట్టీలతో: డేవిడ్ వార్నర్ గురించి కుక్ బయోగ్రఫీలో సంచలనం

హైదరాబాద్: ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో చేతికి వేసుకున్న పట్టీ సాయంతో బంతి స్థితిని మార్చినట్లు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ తనతో స్వయంగా చెప్పాడని తన ఆటో బయోగ్రఫీ 'ద ఆటోబయోగ్రఫీ'లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ పేర్కొన్నాడు. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ పుస్తకంలో అలెస్టర్ కుక్ తన క్రికెట్ విశేషాలను పంచుకున్నాడు.
2017-18 యాషెస్ సిరిస్‌ను సొంతగడ్డపై స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సిరిస్ అనంతరం ఆ జట్టు ఆటగాళ్లతో సరదాగా గడిపిన సందర్భంలో డేవిడ్ వార్నర్ చేతికి వేసుకున్న పట్టీల సాయంతో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో తాను టాంపరింగ్ పాల్పడిన విధానాన్ని వివరించాడని కుక్ తెలిపాడు.

చేతికి వేసుకున్న పట్టీల సాయంతో
"2017-18 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకున్నాక ఆ జట్టు ఆటగాళ్లతో కలిసి సరదాగా గడిపాం. గెలిచిన ఆనందంలో రెండు బీర్లు తాగిన వార్నర్.. చేతికి వేసుకున్న పట్టీల సాయంతో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో తాను టాంపరింగ్ పాల్పడిన విధానాన్ని వివరించాడు. అప్పుడు స్టీవ్ స్మిత్ అక్కడే ఉన్నాడు" అని కుక్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చాడు.

నువ్వు ఇలా చెప్పాల్సింది కాదు
"ఆ సమయంలో అక్కడే ఉన్న స్టీవ్ స్మిత్ ‘నువ్వు ఇలా చెప్పాల్సింది కాదు' అన్నట్టుగా వార్నర్‌వైపు చూశాడు" అని చెప్పాడు. కాగా, గతేడాది సఫారీ పర్యటనలో కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సాండ్ పేపర్‌తో బాల్ టాంపరింగ్‌కు పాల్పడినందుకు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అరంగేట్ర, ఆఖరి టెస్టుల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు
గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్ టెస్టుల్లో అరంగేట్ర, ఆఖరి టెస్టుల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడిగా కుక్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తన మొదటి, ఆఖరి టెస్టు సెంచరీని కుక్ భారత జట్టుపైనే చేయడం విశేషం. 2006లో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో అంతర్జాతీయ టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అలెస్టర్ కుక్ 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అలెస్టర్ కుక్ అరుదైన ఘనత
ఒకే జట్టుపై మొదటి, ఆఖరి టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌గా కాగా, మొత్తంగా మూడో బ్యాట్స్‌మెన్‌గా అలెస్టర్ కుక్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరుపున 161 టెస్టులు ఆడిన అలెస్టర్ కుక్ 44.88 సటుతో 12,254 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2011లో బర్మింగ్‌హామ్‌లో భారత్‌పై 294 పరుగులు అతడి వ్యక్తిగత అత్యధిక పరుగులు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications