హాఫ్ సెంచరీ చేసిన అసంతృప్తి: కసిగా డేవిడ్ వార్నర్ బ్యాటింగ్

Posted By:
Warner

హైదరాబాద్: ఫీజు కోత విషయంలో ఐసీసీ పట్లు ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృప్తితో కనపడుతున్నాడు. ఆతిథ్య సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కసితో బ్యాటింగ్ చేశాడు. శుక్రవారం ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. దక్షిణాఫ్రికా బౌలర్ల పదునైన బంతులకు తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ సంయమనంతో పరుగులు సాధిస్తున్నాడు.

రబాడ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో రెండు ఫోర్లు బాది ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 69 బంతుల్లో 8ఫోర్ల సాయంతో వార్నర్ అర్ధశతకం సాధించడం విశేషం. అనంతరం అభిమానులకు బ్యాట్‌తో అభివాదం మాత్రమే చేసి సహచర బ్యాట్స్‌మన్ బాన్‌క్రాఫ్ట్‌తో షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. కానీ, అతని ముఖంలో చిరు నవ్వులు రాకపోగా.. విచారంతో కనిపించాడు. డికాక్‌తో వాగ్వాదం అనంతరం జరిగిన పరిణామాల నుంచి వార్నర్ ఇంకా కోలుకోనట్లున్నాడు.

29 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. మరోఎండ్‌లో ఉస్మాన్ ఖ్వాజా బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి టెస్టులో భాగంగా నాలుగో రోజైన ఆదివారం మర్క్రమ్, డీకాక్‌లు క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన సమయంలో డీకాక్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వార్నర్ స్లెడ్జింగ్ చేశాడు.

ఇందులో భాగంగా డీకాక్ కుటుంబాన్ని వార్నర్ "Bush Pig" అన్నట్లు దక్షిణాఫ్రికా స్థానిక మీడియా పేర్కొంది. దీనిని ఎంతమాత్రం తట్టుకోలేని డీకాక్ టీ విరామ సమయం మైదానం నుంచి బయటకు వచ్చే సమయంలో వార్నర్ భార్య గురించి "f***ing sook" అని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ పేర్కొంది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు మెట్ల వద్ద వార్నర్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు.

Story first published: Friday, March 9, 2018, 18:35 [IST]
Other articles published on Mar 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి