Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్: అసలేం జరిగింది, తొలి టెస్టుకు వార్నర్ అనుమానమేనా?

Warner ready for first Ashes Test despite neck injury

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య నవంబర్ 23(గురువారం) నుంచి బ్రిస్బేన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందే ఆసీస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. ఆ జట్టు వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు.

సోమవారం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆయనకు మెడ పట్టేసింది. దీంతో వెంటనే వార్నర్ వైద్యులను సంప్రదించాడు. తొలి టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోన్న గబ్బా స్టేడియంలో ఎత్తుగా వచ్చిన బంతిని అందుకున్నప్పుడు వార్నర్‌ మెడ పట్టకపోవడం విశేషం.

ఈ సందర్భంగా వార్నర్ మాట్లాడుతూ 'నా మెడ పట్టేసుకుంది. ఎక్కువ ఎత్తునుంచి వచ్చిన బంతిని అందుకున్నాను. అప్పుడే నా మెడలో ఏదో బెణికినట్టు అయింది. ఇంతకు ముందెప్పుడూ నా మెడ ఇలా లేదు. ఒకటి రెండు రోజుల్లో ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్నా' అని వార్నర్ తెలిపాడు.

'మెడ పట్టక పోవడం వల్ల తాను తొలి టెస్టుకు దూరం అవుతానని అనుకోవడం లేదు. మంగళవారం ప్రాక్టీస్ చేస్తా. నా టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. కాపడం, మసాజ్‌ ద్వారా నా మెడనొప్పి తగ్గొచ్చు' అని డేవిడ్ వార్నర్ తెలిపాడు.

యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌గా డేవిడ్ వార్న‌ర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. స్వదేశంలో వార్నర్ యావరేజి 60గా ఉంది. ఈ టెస్టు సిరిస్‌తో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేస్తున్న కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌తో కలిసి వార్నర్ ఓపెనింగ్‌ చేయాల్సి ఉంటుంది.

Story first published: Tuesday, November 21, 2017, 12:26 [IST]
Other articles published on Nov 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+