బాల్ టాంపరింగ్: డేవిడ్ వార్నర్‌కు గుడ్‌బై చెప్పిన ఎల్‌జీ

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను ఆర్ధికంగా బాగా దెబ్బకొట్టింది. విచారణ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బెన్‌క్రాఫ్ట్‌లు దోషులని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ధారించింది. అయితే విచారణ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఈ ముగ్గురిపై ఇప్పుడే చర్యలు తీసుకోలేమని చెప్పాడు.
మరో 24 గంటల తర్వాత తుది నివేదిక వస్తుందని.. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ తెలిపాడు. దీంతో బుధవారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ భవితవ్యమేమిటో తెలుస్తుంది. మోరోవైపు స్మిత్, వార్నర్‌పై సీఏ ఏడాది నిషేధం విధించడం ఖాయమని ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాంట్రాక్ట్‌ను పొడగించబోమని స్పష్టం చేసిన ఎల్‌జీ
సఫారీ గడ్డపై జరిగే నాలుగో టెస్టులో ఈ ముగ్గురూ ఆడకుండా ఇంటికి పంపించివేసింది. వారి స్థానంలో రెన్‌షా, మ్యాక్స్‌వెల్, జో బర్న్స్ జట్టులో చేరనున్నారు. బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్ దోషిగా తేలడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి కూడా అతను తప్పుకోవాల్సి వచ్చింది. ఈ బాల్ టాంపరింగ్ వల్ల డేవిడ్ వార్నర్ ఆర్ధికంగా కూడా నష్టపోనున్నాడు. నాలుగేళ్లుగా స్పాన్సర్‌గా ఉన్న ఎల్‌జీ కూడా వార్నర్‌తో కాంట్రాక్ట్‌ను పొడగించబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం వార్నర్‌తో ఎల్‌జీ స్పాన్సర్‌షిప్ చివరి దశలో ఉంది.

2014 నుంచి ఎల్‌జీకి బ్రాండ్ అంబాసిడర్‌గా డేవిడ్ వార్నర్
మరికొన్ని వారాల్లో అది ముగియనుంది. అయితే, ఈ బాల్ టాంపరింగ్ ఉదంతం వల్ల కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని నిర్ణయించామని ఎల్‌జీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో చెప్పారు. 2014 నుంచి ఎల్‌జీకి డేవిడ్ వార్నర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అటు క్రికెట్ ఆస్ట్రేలియాకు మేజర్ స్పాన్సర్లుగా ఉన్న వాళ్లు కూడా పలు కార్పోరేట్ సంస్ధలు తప్పుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఈ ఘటనపై విచారణ పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సానిటేరియమ్‌లాంటి స్పాన్సర్లు చెబుతున్నాయి.

భారీ మొత్తంలో నష్టపోనున్న స్మిత్, వార్నర్‌లు
ఇదే గనుక జరిగితే స్మిత్, వార్నర్‌లు భారీ మొత్తంలో నష్టపోనున్నారు. డేవిడ్ వార్నర్ ఆసీక్స్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఛానెల్ 9, గ్రే నికోలస్, మిలో, మేక్ మై విష్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. మొత్తానికి ఈ బాల్ టాంపరింగ్ వివాదం వల్ల బ్రాండ్ అంబాసిడర్లగా ఉన్న సంస్థలు అన్నీ ఈ ఇద్దరితో ఒప్పందాలను రద్దు చేసుకునే యోచనలో ఉన్నాయి. స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే సీఏ నుంచి మ్యాచ్ ఫీజుల రూపంలో మొత్తం సుమారు రూ.19.71 కోట్లను అందుకుంటున్నాడు.

13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు దూరం కానున్న స్మిత్
స్మిత్‌పై ఏడాది నిషేధం విధిస్తే ఈ ఏడాదిలో అతడు 13 టెస్టులు, 24 వన్డేలు, 5 టీ20లకు దూరం కానున్నాడు. ఒక్కో టెస్టుకు 14వేల డాలర్లు, ఒక్కో వన్డేకు 7వేల డాలర్లు, ఒక్కో టీ20కి 5వేల డాలర్లను స్మిత్‌కు సీఏ చెల్లించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని అతడు కోల్పోతాడు. అలాగే శామ్‌సంగ్, న్యూ బాలెన్స్ తదితర ఉత్పత్తులకు స్మిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఈ సంస్థలన్ని ఇప్పుడు స్మిత్‌తో ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు చూస్తున్నాయి. నిషేధం అనంతరం వీరు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించినా ఒకసారి ఇలా చేసినందుకు వారితో కలిసి పనిచేయడానికి సంస్థలు ముందుకు వస్తాయో లేదో అన్నది కూడా అనుమానంగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications