Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నైకి హైదరాబాద్ షాక్: ఫ్లడ్‌లైట్లు పోయి స్టేడియంలో గందరగోళం

హైదరాబాద్: సొంత గడ్డ పైన సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. చెన్నై సూపర్ కింగ్స్ పైన 22 పరుగుల తేడాతో గెలిచింది. హైదరాబాద్ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 170 పరుగులకు పరిమితమై ఓడింది. అంతకు ముందు సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 192 పరుగులు సాధించింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్ 28 బంతుల్లోనే 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ధావన్, మోర్గాన్ కూడా రాణించారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను వార్నర్, శిఖర్ ధావన్ ఆరంభించి, మొదటి వికెట్‌కు 86 పరుగులు జోడించారు.

హెన్రిక్స్ 9 బంతుల్లోనే 19 పరుగులు చేసి, పవన్ నేగీ బౌలింగ్‌లో షాట్ కు ప్రయత్నించి ధోనీ స్టంప్ చేయడంతో పెవిలియన్ చేరాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని 32 బంతుల్లో 37 పరుగులు చేసిన ధావన్ అనవసరంగా పరుగు కోసం ప్రయత్నించి జడేజా మెరుపు ఫీల్డింగ్ కారణంగా రనౌటయ్యాడు.

Warner leads Sunrisers register maiden IPL victory against formidable Super Kings

ధావన్ అవుటైన తర్వాత వికెట్ల పతనాన్ని అడ్డుకునే బాధ్యతను ఇయాన్ మోర్గాన్ తీసుకున్నాడు. అతను జాగ్రత్తగా ఆడుతుండగా, నమన్ ఓఝా (20), ఆశిష్ రెడ్డి (6), హనుమ విహారీ (8) వేగంగా పరుగులు రాబట్టుకునే ప్రయత్నంలో వికెట్లు సమర్పించుకున్నారు.

ఇన్నింగ్స్ చివరి బంతికి కరణ్ శర్మ (4) అవుట్ కాగా, మోర్గాన్ 27 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది.
ఓవర్‌కు సగటున 9.6 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆరంభం నుంచే రన్‌రేట్‌ను పెంచాలన్న ఉద్దేశంతో స్మిత్‌తో కలిసి బ్రెండన్ మెకలమ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.

5 బంతుల్లోనే 12 పరుగులు చేసిన మెకలమ్‌ను భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 14 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయంది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రైనాతో కలిసి 3.2 ఓవర్లలో 34 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన స్మిత్‌ను విహారీ క్యాచ్ పట్టగా హెన్రిక్స్ అవుట్ చేశాడు.

స్మిత్ 19 బంతుల్లో 21 పరుగులు చేశాడు. 15 బంతుల్లో 23 పరుగులు చేసిన రైనాను మోర్గాన్ క్యాచ్ పట్టగా, హెన్రిక్ పెవి లియన్ చేర్చాడు. ధోనీ, డుప్లెసిస్‌‍లు నాలుగో వికెట్‌కు చెన్నైకి 46 పరుగులు జోడించారు. 33 పరుగులు చేసిన డుప్లెసిస్, తర్వాతి బంతికే ధోనీ (20)ని ఆశిష్ రెడ్డి బౌల్డ్ చేశాడు. వీరిద్దరు వెనుదిరగడంతో కంగుతిన్న చెన్నైని పవన్ నేగీ (15)ని భువీ బౌల్డ్ చేయడం కోలుకోలేని దెబ్బతీసింది.

ఆగిన ఫ్లడ్ లైట్లు, నిలిచిన ఆట

హైదరాబాద్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జనరేటర్లో సాంకేతిక లోపంతో ఓ వైపు ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. దీంతో మైదానంలో గందరగోళం నెలకొంది. ఆట నిలిచిపోయింది. 18 నిమిషాల నంతరం ఫ్లడ్ లైట్లు వెలగడంతో ఆట మొదలైంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+