Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌కు వీడ్కోలు పలికితే... రాజకీయల్లోకే: వార్నర్ భిన్న మార్గం

Warner interested in political career

హైదరాబాద్: ఏ రంగంలో అయినా రిటైర్ అయిపోతే సర్దుకుని ఇంటికిపోతారు. కానీ, కొన్నింటిలో మాత్రం వయస్సుతో పనిలేకుండా ఉండే పోస్టుల్లో దూరిపోతారు. ఇలానే క్రికెట్‌లో అయితే కోచ్‌లుగా మారతారు.. లేదంటే వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. ఈ రెండు కాకుంటే.. క్రికెట్‌ పాలనవైపు అడుగులు వేస్తారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకున్నాడు.

కెరీర్‌ ముగిశాక రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాన్ని వదులుకోనని అన్నాడు. క్రికెట్‌ ఆస్ట్రేలియాతో (సీఏ)తో క్రికెటర్ల జీతాల సమస్య ముదిరి పాకాన పడ్డ సమయంలో.. వార్నర్‌ ముందుండి ఉద్యమాన్ని నడిపించాడు. ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయకుండా నిరుద్యోగులుగా మార్చినా అతడు వెనక్కి తగ్గలేదు. అదే స్ఫూర్తితో రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలనుందని వార్నర్‌ తెలిపాడు.

ఆస్ట్రేలియా జట్టులో రాజకీయ నాయకులతో తరుచుగా మాట్లాడే వారిలో వార్నర్‌ ముందు వరుసలో ఉంటాడు. ఓసారి ప్రధానితో సమావేశం సందర్భంగా పరిష్కరించాల్సిన సమస్యలను ఏకరవు పెట్టాడు కూడా. ''చిన్నప్పుడు నేను ఎంతో కష్టపడ్డాను. అమ్మనాన్నలు పనికిపోతే.. సోదరుడితో కలిసి ఇంట్లో పాత్రలు కడిగేవాడిని. బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసేవాడిని. ఆ తర్వాత కాస్త పెద్దయ్యాక పనికి వెళ్లి.. అద్దె చెల్లించడంలో భాగమయ్యాను. హక్కుల కోసం పోరాడేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను' అని తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'ఊరికే కూర్చుంటే కుదరదు. ఎవరో ఒకరు మాట్లాడి ఏదో ఒకటి చేస్తేగానీ సమస్యలు పరిష్కారం కావు'' అని వార్నర్‌ అన్నాడు. ఇటీవల మాట్రవిల్లేలోని తన చిన్ననాటి నివాస ప్రాంతం సమీపాన ఉన్న ఓ పార్కు అభివృద్ధికి నిధులు ఇచ్చేలా దేశ ప్రధాని టోనీ అబాట్‌ను ఒప్పించడం విశేషం

Story first published: Wednesday, February 28, 2018, 10:21 [IST]
Other articles published on Feb 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+