బాల్ టాంపరింగ్ నిషేధం వ్యక్తిగా ఎంతో మార్పు తెచ్చింది: డేవిడ్ వార్నర్

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ నిషేధం తనను ఓ వ్యక్తిగా మార్చిందని ఆస్ట్రేలియా మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. గతేడాది సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్ ఉదంతంతో ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా పేరు దిగజారిపోయింది. దీంతో స్వదేశంలో డేవిడ్ వార్నర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇటీవలే కొత్త సంవత్సరంలో మూడో బిడ్డకు తండ్రి కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా శుభవార్తను అభిమానులతో పంచుకున్నాడు.
ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నా
తాజాగా, ఆస్ట్రేలియా జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కించుకునేందుకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), ఇతర టీ20ల్లో సత్తా చాటేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వార్నర్ చెప్పుకొచ్చాడు. బీపీఎల్ టోర్నీలో పాల్గొనడానికి ముందు డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇంటర్యూ ఇచ్చాడు.

జట్టులో తిరిగి చోటు దక్కించుకుంటా
బీపీఎల్, ఐపీఎల్, టీ20ల్లో రాణించి ఆస్ట్రేలియా జట్టులో తిరిగి చోటు దక్కించుకుంటానని డేవిడ్ వార్నర్ ధీమా వ్యక్తంచేశాడు. అయితే, తాను జాతీయ జట్టులోకి తీసుకోవాలో? వద్దో? జట్టు సెలక్టర్ల నిర్ణయం మీదే ఆదారపడి ఉంటుందని అన్నాడు. తాను మాత్రం ఐపీఎల్, ఇతర టోర్నీల్లో రాణించి సత్తాను చాటుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు.

ఏడాది పాటు నిషేధం
బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన తాను ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. శనివారం(జనవరి 5) నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో సిల్హత్ సిక్సర్స్ జట్టు తరఫున డేవిడ్ వార్నర్ ఆడనున్నాడు.

జనవరి 9న తొలి మ్యాచ్
సిల్హత్ సిక్సర్స్-చిట్టగాంగ్ వైకింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జనవరి 9న జరగనుంది. డేవిడ్ వార్నర్‌పై విధించిన ఏడాది నిషేధం ఈ ఏడాది మార్చితో ముగియనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications