వార్నర్, బెయిర్‌స్టోలు లీగ్‌ను వీడడం పెద్ద లోటు: విలియమ్సన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు లీగ్‌ను వీడడం సన్‌రైజర్స్ జట్టుకు పెద్ద లోటు అని ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నారు. మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు ఈ టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని జట్లు ప్రపంచకప్‌కు ముందు ఆడనున్న సిరీస్ లపై దృష్టి పెడితే.. మరికొన్ని జట్లు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

ప్రపంచకప్ కోసం స్వదేశానికి:
ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు త్వరలో తమ స్వదేశానికి వెళ్లి ప్రపంచకప్ కోసం సిద్దమవనున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు కూడా ఆ జట్టును వీడనున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు.

వారి స్థానాలను భర్తీచేయడం కష్టం:
'వార్నర్, బెయిర్‌స్టోలు జట్టును వీడడం సన్‌రైజర్స్‌కు పెద్ద లోటు. ఇద్దరు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. ఇద్దరు లీగ్ మొత్తానికి అందుబాటులో ఉండరని టోర్నీ ప్రారంభంలోనే తెలుసు. వారి స్థానాలను భర్తీచేయడం కష్టం. కొత్త ఆటగాళ్లు ఓపెనర్లుగా ఆడుతారు' అని విలియమ్సన్ తెలిపారు.

9 మ్యాచ్‌లు.. 517 పరుగులు:
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఓపెనర్లు రాణించడంతోనే ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు వచ్చాయి. ఆసీస్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 9 మ్యాచ్‌లు ఆడి 73.85 సగటుతో 517 పరుగులు చేశాడు. 148.56 స్ట్రయిక్ రేట్ ఉంది. ఇందులో 6 అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరివరకు క్రీజులో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ నెల చివరలో వార్నర్ ఆసీస్ జట్టుతో కలవనున్నాడు.

9 మ్యాచ్‌లు.. 445 పరుగులు:
మరో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో కూడా 9 మ్యాచ్‌లు ఆడి 158.36 స్ట్రయిక్‌రేట్‌తో 445 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మంగళవారం చెన్నైతో మ్యాచ్ అనంతరం బెయిర్‌స్టో ఇంగ్లండ్ వెళ్లనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications