Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సిఎ సెక్రటరీని నిందించడం వల్ల షేన్‌వార్న్ ఇబ్బందుల్లో పడ్డాడా..?

Shane Warne
రాజస్దాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్ ఇప్పుడు కొంచెం ట్రబుల్‌లో పడ్డాడని సమాచారం. అందుకు కారణం రాజస్దాన్ క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ సంజయ్ ధీక్షిత్‌ను వార్న్ నిందించాడని నెపంతో షేన్ వార్న్‌పై రాజస్దాన్ క్రికెట్ అసోషియేషన్, బిసిసిఐలో కంప్లైంట్ చేసింది. ఇటీవల కాలంలోనే రాజస్దాన్ రాయల్స్ కెప్టెన్‌గా తాను ఐపిఎల్ నుండి వైదోలుగుతున్నట్లు షేన్ వార్న్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలో సడన్‌గా షేన్ వార్న్‌పై ఇలా కంప్లైంట్ చేయడం ఆలోచించదగ్గ విషయం.

రాత్రి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగినటువంటి మ్యాచ్‌లో రాజస్దాన్ రాయల్స్‌పై తొమ్మిది వికెట్లు ఆధిక్యంతో బెంగుళూరు గెలిచింది. రాజస్దాన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ నరేంద్ర జోషి ఐపిఎల్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందర్ రామన్‌కి లేఖ వ్రాయడం జరిగింది. ఆ లేఖలో సుందర్ రామన్ షేన్ వార్న్ బహిరంగంగా సంజయ్ ధీక్షిత్‌ని నువ్వు చాలా అహాం కలవాడివని అన్నాడని పేర్కోన్నారు. ఈ సన్నివేశం ఎప్పుడు జరిగిందంటే మాన్ సింగ్ స్టేడియంలో ప్రైజ్ ఇచ్చేసిన తర్వాత జరిగింది.

వివరాలలోకి వెళితే మ్యాట్ ఓడిపోయిన భాదలో ఉన్న షేన్ వార్న్ సంజయ్ దీక్షిత్ దగ్గరకు వెళ్శి నిందించడం జరిగింది. ఈ సందర్బంలో రాజస్దాన్ రాయల్స్ ప్రాంచైజీ ఓనర్ శిల్పాశెట్టి జరిగిన విషయంపై సంజయ్ ధీక్షిత్‌కు సారీ చెప్పడం జరిగింది. దీంతో సంజయ్ ధీక్షిత్ కూడా సపరేట్‌గా షేన్ వార్న్ పై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంలో సంజయ్ ధీక్షిత్ మాట్లాడుతూ రాజస్దాన్ రాయల్స్ టీమ్ వరుసగా పరాజయాలు పాలవ్వడంతో షేన్ వార్న్ తట్టుకోలేక పోవడం వల్లే అలా ప్రవర్తించాడని తెలియజేశారు.

బెంగళూరు గత ఐదు విజయాల్లో కీలకపాత్ర పోషించిన గేల్‌.. ఆరో మ్యాచ్‌లో కూడా బెంగళూరు విజయ తీరాలకు చేర్చాడు. గేల్‌కు తోడు దిల్షాన్‌, కోహ్లీలు తమవంతు పాత్ర పోషించారు. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ (70 నాటౌట్‌, 44 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో), తిలకరత్నె దిల్షాన్‌ (38; 24 బంతుల్లో 8 ఫోర్లతో) లు పటిష్టపునాది వేశారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. ఈ దశలో షేన్‌ వార్న్‌ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చిన తిలకరత్నె దిల్షాన్‌ పెవిలియన్‌ చేరాడు. దిల్షాన్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ (39; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో) రాజస్థాన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా.. గేల్‌ కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. వీరిద్దరు కలిసి రెండవ వికెట్‌కు ఏకంగా 83 పరుగులు జోడించి బెంగళూరును విజయ తీరాలకు చేర్చారు.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా జోహాన్‌ బోథా ధారాళంగా పరుగులిచ్చాడు. క్రిస్‌ గేల్‌ ఒక్కడే బోథా బౌలింగ్‌లో 21 పరుగులు చేశాడు. షేన్‌ వార్న్‌ కూడా వదలని గేల్‌.. అతని బౌలింగ్‌లో 18 పరుగులు చేశాడు. ఓవైపు గేల్‌ రెచ్చిపోతుంటే.. విరాట్‌ కోహ్లీ బాధ్యాయుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో కేవలం ఒకే ఒక వికెట్‌ కోల్పోయిన బెంగళూరు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+