Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాట్స్ మెన్ వల్లే ఓటమి: వార్న్

Shane Warne
కేప్ టౌన్: బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ పై తమ ఓటమికి తమ బ్యాట్స్ మెన్ కారణమని రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ షేన్ వార్న్ అన్నారు. ఐపియల్ సెకండ్ సీజన్ తొలి మ్యాచులో ఓటమికి ఆయన బాట్స్ మెన్ ను తప్పు పట్టారు. 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 58 పరుగులకే అవుటైంది.

ఓటమి తనను ఇబ్బంది పెట్టిందని, ఛాంపియన్లమైన తాము పోరాడాల్సి ఉండిందని ఆయన అన్నారు. నిరుడు బెంగుళూర్ సరిగా ఆడలేదని, ఈసారి దూకుడుగా ఆడిందని ఆయన చెప్పారు. 134 పరుగుల లక్ష్యాన్ని రెండు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే చేదించాల్సి ఉండిందని ఆయన అన్నారు.

బ్యాట్స్ మెన్ షాట్ సెలక్షన్ బాగా లేదని, వచ్చే మ్యాచ్ లో టాప్ ఆర్డర్ లో మూడు లేదా నాలుగు స్థానాల గురించి ఆలోచించాల్సి ఉందని ఆయన చెప్పారు. నిరుటి లాగానే తమ జట్టు విజయపథంలో నడుస్తుందని, తాము తిరిగి పుంజుకుంటామని ఆయన అన్నారు. నిరుడు కూడా తమ ప్రారంభం బాగా లేదని, తొలి మ్యాచ్ లో డేర్ డెవిల్స్ చేతిలో ఓడిపోయామని, ఆ తర్వాత పుంజుకున్నామని ఆయన గుర్తు చేశారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+