Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్ సిరిస్‌కు జట్టు ఎంపికలో గందరగోళం: షేన్ వార్న్ అసంతృప్తి

Warne: Australia look confused ahead of Ashes

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో టిమ్ పెయిన్‌ ఎంపిక కాస్తంత గందరగోళాన్ని సృష్టించిందని ఆ దేశ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ అన్నాడు. నవంబర్ 23న బ్రిస్బేన్ వేదికగా మొదలయ్యే యాషెస్ టెస్టు సిరిస్ కోసం శుక్రవారం సెలక్టర్లు ఆస్ట్రేలియా జట్టుని ప్రకటించారు.

తొలి రెండు టెస్టులకు ఆసీస్ సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో వికెట్ కీపర్‌గా టిమ్ పెయిన్‌ను ఎంపిక చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల కాలంలో రాణిస్తున్న మాథ్యూ వేడ్, నెవిల్‌లను కాదని ఏడేళ్ల తర్వాత పెయిన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

32 ఏళ్ల టిమ్ పెయిన్‌ చివరిసారిగా 2010లో టెస్టు క్రికెట్ ఆడాడు. ఈ ఎంపిక తొలి టెస్టులో ప్రత్యర్ధి ఇంగ్లాండ్ జట్టుకు అనుకూలించవచ్చని షేన్ వార్న్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా సెలక్టర్లు వికెట్‌ కీపర్‌‌గాటిమ్ పెయిన్‌‌ను ఎంపిక చేయడం తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని వార్న్ తెలిపాడు.

దేశవాళీ టోర్నీలో రాష్ట్ర జట్టే ఎంపిక చేయని టిమ్ పెయిన్‌ను ఏకంగా యాషెస్ టెస్టు సిరిస్‌కు ఎంపిక చేయడాన్ని వార్న్ ప్రశ్నించాడు. మరోవైపు పేసర్‌, 34 ఏళ్ల షాన్‌ మార్స్‌ను తొలి టెస్టుకు ఎంపిక చేశారు. దీంతో ఇంగ్లాండ్ ఏ మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుపోతుందని వార్న్ అన్నాడు.

30 ఏళ్లుగా తొలి టెస్టు జరిగే గబ్బాలో ఆస్ట్రేలియా ఓటమిని ఎరుగదు. అలాంటిది ఈసారి సిరిస్‌లో ఆసీస్‌ను ఇంగ్లాండ్ ఓడించే అవకాశం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆసీస్ జట్టు ఎంపికపై అభిమానులు చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.

'అసలు ఇదొక టీమేనా? తెలివి తక్కువ వాళ్లు ఎంపిక చేసినట్లుంది' అంటూ ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్‌గిల్ ట్విట్టర్‌లో విమర్శించాడు.

తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్, జాక్సన్ బర్డ్, ప్యాట్ కమిన్స్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, జోష్ హేజిల్‌వుడ్, ఉస్మాన్ ఖవాజా, నేథన్ లయన్, షాన్ మార్ష్, టిమ్ పెయిన్, చాడ్ సేయర్స్, మిచెల్ స్టార్క్

Story first published: Saturday, November 18, 2017, 13:08 [IST]
Other articles published on Nov 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+