'శ్రీలంకకు ప్రాక్టీస్ మ్యాచ్, కానీ మాకు కాదు'
హైదరాబాద్: శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ బౌలింగ్‌ని వార్మప్ మ్యాచ్‌లో ఎదుర్కోనుండటం ఓ మంచి అవకాశమని టీమిండియా యువ క్రికెటర్ సంజూ శాంసన్ అభిప్రాయపడ్డాడు. శనివారం నుంచి శ్రీలంక జట్టుతో భారత బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో బోర్డు ఎలెవన్ జట్టుకి సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గాయం కారణంగా నోమన్ ఓజా జట్టుకు దూరం కావడంతో సారథ్య బాధ్యతలను సంజూ శాంసన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ 'టీమ్ స్ట్రాటజీతో ఆడతాం. శ్రీలంక జట్టుకు ప్రాక్టీస్ మ్యాచ్, కానీ మాకు కాదు' అని అన్నాడు.

యువ ఆటగాళ్లకు ఓ గొప్ప అవకాశం
'జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇదొక గొప్ప అవకాశం. ఇది ఒకే ఒక్క మ్యాచ్ అయినప్పటికీ యువ ఆటగాళ్లకు ఓ గొప్ప అవకాశం. దీనిని ఓ గొప్ప అవకాశంగా భావించి విజయం సాధిస్తాం' అని శాంసన్ తెలిపాడు.

రంగనా హెరాత్ చాలా అనుభవం ఉన్న క్రికెటర్
'ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన హెరాత్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం ద్వారా ఆటని మరింత మెరుగుపరచుకోవచ్చు. రంగనా హెరాత్ చాలా అనుభవం ఉన్న క్రికెటర్. శనివారం అతనికి ప్రాక్టీస్ మ్యాచ్.. కానీ.. మాకు మాత్రం అలాంటి బౌలర్‌ని ఎదుర్కోనేందుకు దొరికే మంచి అవకాశం' అని సంజూ శాంసన్ వివరించాడు.

శ్రీలంక గొప్ప స్పిన్నర్లలో అతనూ ఒకడు
'శ్రీలంక తరఫున గొప్ప స్పిన్నర్లలో అతనూ ఒకడు. దిగ్గజ స్పిన్నర్ హోదాలో ఉన్న అతడి బౌలింగ్‌లో ఆడితే చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే వార్మప్ మ్యాచ్‌ని సీరియస్‌గా ఆడతాం' అని తెలిపాడు. ఇటీవల సొంతగడ్డపై శ్రీలంక... భారత్ చేతిలో అన్ని ఫార్మాట్లలోనూ క్లీన్‌స్వీప్‌కు గురైన సంగతి తెలిసిందే.

టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్న బోర్డు ఎలెవన్ జట్టు
ఇదిలా ఉంటే శనివారం ప్రారంభమైన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బోర్డు ఎలెవన్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. కాగా, ఇరు జట్ల మధ్య నవంబర్ 16 (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications