Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెరిసిన డుప్లెసిస్, ఫెలుక్వాయో: వార్మప్ మ్యాచ్‌లో లంకపై నెగ్గిన సఫారీలు

Warm-up: Du Plessis, Phehlukwayo shine as South Africa beat Sri Lanka by 87 runs

హైదరాబాద్: కార్డిఫ్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగుల భారీస్కోరు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ డుప్లెసిస్‌ 69 బంతుల్లో 88(7 ఫోర్లు, 4 సిక్సులు), హషీమ్‌ ఆమ్లా 61 బంతుల్లో 65(9ఫోర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

శ్రీలంక బౌలర్లలో లక్మల్, నువాన్‌ ప్రదీప్‌ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 42.3 ఓవర్లలో 251 పరుగులకే ఆలౌటైంది. కరుణరత్నే 92 బంతుల్లో 87(12 ఫోర్లు), ఏంజెలో మాథ్యూస్‌ 66 బంతుల్లో 64(6 ఫోర్లు, ఒక సిక్స్) మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించారు.

కాగా, టోర్నీలో భాగంగా శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. వార్మప్ మ్యాచ్ షెడ్యూల్‌లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా కోహ్ల నాయకత్వంలోని టీమిండియా జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

వరల్డ్‌కప్‌లో భారత జట్టు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, ధోని(వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ

Story first published: Saturday, May 25, 2019, 11:33 [IST]
Other articles published on May 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+