Kohli vs Rohith ఫ్యాన్స్.. మధ్యలోకి కేఎల్ రాహుల్! అంబానీ మ్యాజిక్ వద్దంటూ..!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని తెలిపాడు. పని భారం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డే‌ల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు గురువారం ట్విటర్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నాడు. కెప్టెన్‌గా తన ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. సన్నిహితులు, లీడర్‌షిప్ గ్రూప్‌లోని కీలక సభ్యులైన హెడ్ కోచ్ రవిశాస్త్రి, రోహిత్ శర్మలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ జైషాతో పాటు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నాడు. అయితే భారత కెప్టెన్ సంచలన నిర్ణయం నేపథ్యంలో ట్విటర్ వేదికగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

కేఎల్ రాహుల్ కెప్టెన్ చేయాలంటూ..

టీ20 కెప్టెన్సీ సారథ్య బాథ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పడంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు మార్గం సుగుమమైంది. విరాట్‌ తర్వాత టీ20ల్లో భారత జట్టును హిట్‌మ్యాన్ నడిపించనున్నాడు. అయితే రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు ఇవ్వవద్దని కోహ్లీ అభిమానులు సూచిస్తున్నారు. యువ ఆటగాడైన కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలు ఇవ్వాలని, టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. కెప్టెన్‌గా రాహుల్‌కు కూడా అనుభవం ఉందని పేర్కొంటున్నారు.

అంబాని మ్యాజిక్‌లు వద్దు..

కోహ్లీ తర్వాత టీ20 సారథ్య బాధ్యతలను కేఎల్ రాహుల్ లేదా శ్రేయస్ అయ్యర్‌లలో ఒకరికి ఇవ్వాలని, అంతర్జాతీయ క్రికెట్‌లో అంబాని మ్యాజిక్‌కు అవకాశం ఇవ్వద్దని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ వారసుడిగా టీ20 సారథ్య బాధ్యతలను చేపట్టేది కేఎల్ రాహులేనని ట్వీట్ చేస్తున్నారు. కోహ్లీ పేరిట ఉన్న అభిమాన గ్రూప్‌ల్లోనే ఇవే పోస్ట్‌లు పెడుతున్నారు. అంతేకాకుండా క్వశ్చన్ పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు. దాంతో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారాయి.

టీ20 ప్రపంచకప్‌ ముందే తప్పుకోవాల్సింది..

మరోవైపు రోహిత్ అభిమానులు మాత్రం ఇప్పటికైనా కోహ్లీ మంచి పని చేశాడని, టీ20 ప్రపంచకప్ ముందే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ మెగా టోర్నీ ఆడితే కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ మంచి బ్యాట్స్‌మన్ అయినప్పటికీ గొప్ప కెప్టెన్ కాదని కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు రోహిత్ శర్మ‌కు భారత జట్టును నడిపించే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రోహిత్ కెప్టెన్ అవ్వడాన్ని జీర్ణించుకోలేకే కోహ్లీ ఫ్యాన్స్ కేఎల్ రాహుల్ పేరును తెరమీదకు తీసుకువస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆటగాళ్ల అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తా..

బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తా..

'టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. భారత కెప్టెన్‌గా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ, నా కోచ్‌లు, భారత విజయాన్ని ఆకాంక్షించిన ప్రతీ అభిమానికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. గత 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం.. 5-6 ఏళ్లుగా భారత జట్టు సారథిగా కొనసాగుతుండటంతో నాపై పని భారం ఎక్కువైంది. కాస్త విశ్రాంతి కావాలనుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్‌గా నా సాయశక్తులా కృషి చేశాను. ఇకపై బ్యాట్స్‌మెన్‌గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతాను.

నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులతో చర్చించాను. లీడర్‌షిప్‌ గ్రూపులో కీలకమైన రవి భాయ్‌, రోహిత్‌తో కూడా మాట్లాడాను. అందుకే దుబాయ్‌ వేదికగా అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. ఈ విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా, ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీతో కూడా మాట్లాడాను. వన్డే, టెస్టు కెప్టెన్‌గా నా శక్తిమేర జట్టును ముందుకు నడిపిస్తాను'' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, September 16, 2021, 20:52 [IST]
Other articles published on Sep 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X