Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లలిత్ మోడీపై ధ్వజమెత్తిన శశాంక్ మనోహర్

Shashank Manohar
ముంబై: రహస్య సమాచారాన్ని ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీ మీడియాకు వెల్లడించారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ధ్వజమెత్తారు. ఐపియల్ పాలక మండలి సమావేశం ఈ నెల 26వ తేదీన సమావేశమవుతుందని ఆయన చెప్పారు. లలిత్ మోడీని తప్పించేందుకు ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. అంతర్గత సమాచార వినిమయాన్ని లలిత్ మోడీ మీడియాకు వెల్లడించి నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో తాను నోరు విప్పక తప్పడం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

లలిత్ మోడీ లేకుండా పాలక మండలి సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. కొచ్చి ఐపియల్ జట్టు కాంట్రాక్టు 2008 జనవరిలో జరిగిందని, అయితే మోడీ కొచ్చి యాజమాన్యం వివరాలను ఏప్రిల్ 11వ తేదీన మీడియాకు వెల్లడించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. రహస్య నిబంధనలను ఉల్లంఘించినందుకు తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కొచ్చి ఐపియల్ జట్టు సహ యజమాని వేణుగోపాల్ తనతో చెప్పారని, దాంతో వివరణ అడుగుతూ తాను మోడీకి మెసేజ్ పంపానని ఆయన చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+