Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ చేసిన అతిపెద్ద తప్పు అదే: వకార్

Waqar Younis thinks Pakistan got it totally wrong against India in 2019 World Cup

కరాచీ: గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాభవానికి కారణం పాక్ స్వయం కృతాపరాథమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్‌‌ వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచినా బ్యాటింగ్ తీసుకోకుండా.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడం పాక్ చేసిన మొదటి తప్పన్నాడు. అతి విశ్వాసమే ఆ మ్యాచ్‌లో పాక్ కొంప ముంచిందన్నాడు. భారత జట్టులో మంచి ఓపెనర్లు ఉన్నారన్న సంగతిని సర్ఫరాజ్ మర్చిపోయి ఉంటాడని వకార్ ఎద్దేవా చేశాడు.

బ్యాటింగ్‌కు ఆహ్వానించడమే అతిపెద్ద తప్పు:

బ్యాటింగ్‌కు ఆహ్వానించడమే అతిపెద్ద తప్పు:

'టాస్‌ దగ్గరి నుంచి పాకిస్తాన్‌ తప్పుచేయడం ఆరంభించింది. టాస్‌ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ ఇచ్చారు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడు టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్‌ ఇవ్వడం అంటే చాలా పెద్ద పొరపాటు. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది మొదలు చివరి వరకూ పరుగుల వరద పారించింది. పాకిస్తాన్‌ బౌలర్లకు పిచ్‌ నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. భారత్‌ను ఆపడం పాక్‌ బౌలర్లకు కష్టంగా మారిపోయింది. అదే పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ముందుగా బ్యాటింగ్‌ చేసే అవకాశాన్ని భారత్‌ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది' అని వకార్ యూనిస్‌‌ తెలిపాడు. అనాలోచిత నిర్ణయాలే పాక్‌ను పరాజయంలోకి నెట్టేశాయన్నాడు.

‌89 పరుగులతో ఓటమి:

‌89 పరుగులతో ఓటమి:

ఆ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్‌కు భారత్‌ భారీ స్కోర్ చేసింది. రోహిత్‌ శర్మ (140), కేఎల్‌ రాహుల్ ‌(57), విరాట్‌ కోహ్లీ(77)లు రాణించడంతో భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ ఛేజింగ్‌లో విఫలమైంది. ఫకార్‌ జమాన్ ‌(62), బాబర్‌ అజామ్ ‌(48)లు మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్‌మన్‌ తడబడడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత్‌ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కల్గించిన ఆ మ్యాచ్‌కు పాకిస్తాన్‌ 40 ఓవర్లలో ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓటమి పాలైంది.

మాటల యుద్దాన్ని ఆపేస్తే మంచిది:

మాటల యుద్దాన్ని ఆపేస్తే మంచిది:

మాజీ కికెటర్లు గౌతమ్‌ గంభీర్‌, షాహిద్‌ అఫ్రిది సామాజిక మాధ్యమాల వేదికగా తమ మాటల యుద్దాన్ని ఆపేస్తే మంచిదని పాక్‌ బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ సూచించాడు. సోషల్‌ మీడియాలో కాస్త విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు జరగాలని ఆకాంక్షించారు. 'చాన్నాళ్లుగా గంభీర్‌, అఫ్రిదిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. దాన్ని ఏదో ఒక స్థాయిలో ఆపేయాల్సిన అవసరం ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఇలా సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదానికి దిగడం మంచిది కాదు. ఇద్దరూ సంయమనం పాటిస్తూ.. ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి' అని అన్నాడు.

87 టెస్టులు.. 373 వికెట్లు:

87 టెస్టులు.. 373 వికెట్లు:

వకార్ యూనిస్.. పాకిస్థాన్ మాజీ పేసర్. 1990లో అత్యంత వేగవంతమైన బంతులతో బ్యాట్స్‌మన్‌ను గజగజలాడించిన బౌలర్. అతని పదునైన పేస్‌.. అనూహ్య స్వింగ్‌‌కు ఎంతటి బ్యాట్స్‌మన్ అయినా వికెట్ సమర్పించుకునేవాడు. వాటికి తోడు షార్ట్‌ పిచ్‌ బంతులతో అటాకింగ్ చేసేవాడు. అతని ధాటికి సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడ్డారు. వకార్ పాక్ తరఫున 87 టెస్టులు ఆడి 373 వికెట్లు, 262 వన్డేలు ఆడి 416 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, June 19, 2020, 20:15 [IST]
Other articles published on Jun 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+