Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వకార్‌ యూనిస్‌ అసంతృప్తి.. భారత్‌-పాక్‌ సమరం లేని ఆ టోర్నీ అర్థరహితం!!

Waqar Younis says World Test Championship without Indo-Pak series doesnt make sense

కరాచీ: ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌పై పాకిస్తాన్ మాజీ పేసర్‌ వకార్‌ యూనిస్‌ అసంతృప్తి వ్యక్తం చేసాడు. భారత్‌, పాక్‌ జట్ల మధ్య మ్యాచ్‌లు లేకుండా టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహించడం అర్థరహితమని యూనిస్‌ పేర్కొన్నాడు. దాయాది దేశాల ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. ఐసీసీ మరింత చొరవ తీసుకొని ఉండాల్సిందన్నాడు. 2019 ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమయిన విషయం తెలిసిందే.

 ఐసీసీ మరింత చొరవ చూపాల్సింది:

ఐసీసీ మరింత చొరవ చూపాల్సింది:

తాజాగా వకార్‌ యూనిస్‌ మాట్లాడుతూ... 'ప్రభుత్వ స్థాయిలోనూ భారత్‌-పాక్‌ మధ్య పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. ఏదేమైనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విషయంలో ఐసీసీ మరింత చొరవ చూపాల్సింది. బీసీసీఐ, పీసీబీ బోర్డుల మధ్య జోక్యం చేసుకోవాల్సింది. ఎందుకంటే.. దాయాదుల పోరు లేని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అర్థరహితం అని నా అభిప్రాయం. టీమిండియాపై టెస్టుల్లో అరంగేట్రం చేయడం నేను ఇప్పటికీ మర్చిపోలేను' అని అన్నాడు. వకార్‌ 14 ఏళ్ల తన కెరీర్‌లో భారత్‌పై ఆడింది కేవలం 4 టెస్టులే.

గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు:

గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు:

'ప్రస్తుతం టీమిండియా బౌలర్లు కఠినంగా శ్రమిస్తున్నారు. క్రమం తప్పకుండా 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నారు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ భారత బౌలింగ్‌ దాడిని ముందుకు నడిపిస్తున్నారు. అందుకే టీమిండియా టెస్టు సహా అన్ని ఫార్మాట్లలో మెరుస్తోంది. గతంలో కంటే.. భారత జట్టులో పేసర్లు సాధ్యమైనంత వరకు స్థిరంగా ఆడుతున్నారు' అని వకార్‌ యూనిస్‌ అన్నాడు.

పేసర్ల దృక్పథం మారింది:

పేసర్ల దృక్పథం మారింది:

'భారత్ వన్డే, టీ20ల్లో ప్రయోగాలు చేస్తోంది. నా విధానం కూడా అదే. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించేవారికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలి. మహ్మద్‌ అబ్బాస్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ అందుకు ఓ ఉదాహరణ. ప్రస్తుతం పేసర్ల దృక్పథం మారింది. వారు దూకుడుగా కాకుండా రక్షణాత్మకంగా ఆడుతున్నారు. ఐసీసీ నిబంధనలు మారడం, ఫీల్డింగ్‌లో మార్పులు, బ్యాటు వైశాల్యం పెంచడంతో అలా చేస్తున్నారు. కానీ.. మా రోజుల్లో దూకుడుగా బంతులు విసిరి విజయవంతం అయ్యేవాళ్లం' అని వకార్‌ చెప్పుకొచ్చాడు.

2021లో ఫైనల్:

2021లో ఫైనల్:

2019 ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమయింది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్‌షిప్‌‌లో పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. అన్ని టెస్టుల అనంతరం టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది.

Story first published: Wednesday, March 18, 2020, 10:39 [IST]
Other articles published on Mar 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+