టీమిండియాపై విషం కక్కుతోన్న వకార్ యూనిస్

కరాచీ: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తా ఉంటే.. ఇంకొకడు చుట్టకు నిప్పు అడిగాడు అనేది ఓ ముతక సామెత. ప్రస్తుతం ఈ సామెత పాకిస్తాన్‌కు అతికినట్టు సరిపోతోంది. టీమిండియా అసలే మ్యాచ్ ఓడిన నిరాశలో ఉంటే.. పైనుంచి రాళ్లేస్తోంది పాకిస్తాన్. మ్యాచ్ చేజార్చుకున్న దిగ్భ్రాంతిలో ఉన్న టీమిండియాపై నిప్పులు చిమ్ముతోంది. విషం కక్కుతోంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని పాకిస్తాన్ మాజీ కేప్టెన్, ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ నిప్పులు చెరుగుతున్నారు. రెండుసార్లు ప్రపంచకప్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న ఘనతను అందుకున్న భారత క్రికెట్ జట్టు క్రీడాస్ఫూర్తిని విస్మరించిందని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.

పాక్‌కు సెమీస్ అవకాశాలకు గండి..
ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్లు నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో.. భారత క్రికెట్ జట్టు మొత్తం 50 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశాలు దాదాపుగా ఖాయమైనట్టే. అదే సమయంలో- ఇంగ్లండ్ గెలుపు పాకిస్తాన్ జట్టుకు సెమీఫైనల్ చేరుకునే ద్వారాలను మూసివేసింది.

ఆరోపణలునిజం చేసేలా..
భారత క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ ఓటమిని అడ్డుగా పెట్టుకుని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, మాజీ కేప్టెన్లు టీమిండియాపై తమ అక్కసును వెల్లగక్కుతున్నారు. ట్విట్టర్ వేదికగా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు బాసిత్ అలీ, సికిందర్ భక్త్ వంటి ఒకరిద్దరు మాజీ ఆటగాళ్లు.. టీమిండియా చిత్తశుద్ధిపై వేలెత్తి చూపిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ జట్టును సెమీఫైనల్ దాకా రాకుండా అడ్డుకోవడానికి భారత జట్టు ఉద్దేశపూరకంగానే ఓడిపోతుందని వారిద్దరూ ఇదివరకే ఆరోపించారు. మీడియా వేదికగా విమర్శలు చేశారు. బాసిత్ అలీ చేసిన వ్యాఖ్యలు నిజం చేసేలా టీమిండియా ఓటమి పాలైందని వకార్ యూనిస్ అన్నారు.
మీ క్రీడాస్ఫూర్తి ఏమైనట్టు..?
మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే వకార్ యూనిస్ తన ట్విట్టర్‌కు పని చెప్పారు. ట్విట్టర్ వేదికగా టీమిండియాపై విమర్శలు చేశారు. ఇలాంటి ఓటమిని తాను ఊహించలేదని చెప్పుకొచ్చారు. ఈ విమర్శలకు కాస్త వేదాంతాన్ని జోడించారాయన. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు వెళ్తుందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెట్టి చూస్తే.. టీమిండియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని ఆరోపించారు. తన దేశ క్రికెట్ జట్టు సెమీఫైనల్‌కు వెళ్లకపోయినప్పటికీ.. తాను పెద్దగా బాధపడేవాడిని కాదని అన్నారు. ఆ విషయాన్ని పట్టించుకోబోనని చెప్పారు.

కొంతమంది ఛాంపియన్లు దారుణంగా విఫలం.
క్రీడాస్ఫూర్తిని చాటుకునే దిశగా పెట్టిన పరీక్షలో టీమిండియాలో కొంతమంది ఛాంపియన్లు దారుణంగా విఫలం అయ్యారని వకార్ యూనిస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టీమిండియా మాజీ కేప్టెన్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఉద్దేశించి చేసినవేనని అంటున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ.. విజయం కోసం ఏ మాత్రం పోరాటం చేయలేదంటూ ఇప్పటికే ఆయనపై విమర్శల జడివాన మొదలైన విషయం తెలిసిందే. కేదార్ జాదవ్‌తో కలిసి కనీసం ఫోర్ల కోసం కూడా ప్రయత్నించకుండా డాట్ బాల్స్ ఆడుతూ కాలక్షేపం చేశారని ఆరోపిస్తున్నారు క్రికెట్ ప్రియులు. తాజాగా వకార్ యూనిస్ చేసిన కామెంట్స్ కూడా పరోక్షంగా ధోనీని ఉద్దేశించినవేనని అంటున్నారు.
{headtohead_cricket_3_2}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications