న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనొక పోరాట యోధుడు, ఐదేళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో..

Waqar Younis calls Mohammad Aamer a fighter

హైదరాబాద్: స్టాట్ ఫిక్సింగ్ చేసి ఐదేళ్లు జట్టుకు దూరమైన క్రికెటర్‌ను పోరాట యోధుడంటూ సీనియర్ క్రికెటర్ పొగిడేస్తున్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఓ పోరాట యోధుడని ఆ దేశ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డారు. స్ఫాట్ ఫిక్సింగ్ కారణంగా ఐదేళ్ల పాటు నిషేధానికి గురైన మొహమ్మద్ అమీర్ పునరాగమనం తర్వాత అత్యుత్తమంగా రాణిస్తూ పాకిస్థాన్ జట్టులో అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగాడు.

ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఈ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్‌లను మలుపుతిప్పే అద్భుతమైన ప్రదర్శనని కనబర్చాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన అమీర్.. ఇంగ్లాండ్‌పై ఏడు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా.. రెండో ఇన్నింగ్స్‌లో 4/36‌తో పాక్‌కి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

'ఐదేళ్ల నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి పునరాగమనం చేయడం అంత సులువు కాదు. 18 ఏళ్ల యువ బౌలర్‌‌ని ఐదేళ్లు పక్కన పెట్టడం, పునరాగమనంలో మునుపటిలానే అతను బౌలింగ్ ప్రదర్శన చేయడాన్ని ఊహించలేం. ఆటలో చాలా మార్పులు వచ్చాయి. కానీ.. మొహమ్మద్ అమీర్ పోరాట యోధుడు.. నా మద్దతు ఎప్పుడూ అతనికి ఉంటుంది. ఎందుకంటే జీవితంలో అందరం తప్పులు చేస్తుంటాం' అని వకార్ యూనిస్ వెల్లడించాడు.

2010లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన సమయంలో ఉద్దేశపూర్వకంగా నోబాల్ విసిరి మొహమ్మద్ అమీర్ స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడు. దీంతో.. అతడిపై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించింది. అప్పటికి అమీర్ వయసు 18ఏళ్లే.

Story first published: Tuesday, June 12, 2018, 10:05 [IST]
Other articles published on Jun 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X