Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బర్త్ డే రోజున కేక్ కట్ చేసి ట్విట్టర్‌లో సారీ చెప్పిన వకార్ యూనిస్

Waqar Younis apologises for cutting cake of Wasim Akrams Birthday during Ramzan

హైదరాబాద్: 'పవిత్ర రంజాన్ మాసంలో కేక్ కట్ చేసినందుకు నన్ను క్షమించండి' అంటూ పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ వకార్ యూనిస్ తన ట్విట్టర్‌లో అభిమానులను కోరాడు. అసలేం జరిగిందంటే...

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. హెడ్డింగ్లే వేదికగా ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. గత ఆదివారం పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ 52వ పుట్టినరోజుని జరుపుకున్నాడు.

సారీ చెప్పిన వకార్ యూనిస్

అదే సమయంలో ఈ టెస్టు మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తున్న వకార్ యూనిస్... వసీమ్ అక్రమ్ పుట్టినరోజుని సందర్భంగా కేక్ కట్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై వకార్ స్పందిస్తూ రంజాన్ మాసంలో ఇలా కేక్ కట్ చేసినందుకు సారీ చెప్పాడు.

 రెండో టెస్టులో పాక్ ఓటమి

రెండో టెస్టులో పాక్ ఓటమి

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 55 పరుగులు తేడాతో విజయం సాధించింది. అంతకముందు లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరిస్ 1-1తో సమయం అయింది.

1992 వరల్డ్ కప్‌లో అక్రమ్ కీలకపాత్ర

1992 వరల్డ్ కప్‌లో అక్రమ్ కీలకపాత్ర

ఇక, వసీం అక్రమ్ విషయానికి వస్తే క్రికెట్ ప్రపంచం అందించిన అత్యుత్తమ ఎడమచేతివాటం బౌలర్లలో ఒకడు. 1992 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ విజయం సాధించడంలో వసీం అక్రమ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అలెన్ లాంబ్, క్రిస్ లూయిస్‌లను పెవిలియన్‌కు చేర్చిన బంతులు ఇప్పటికీ అభిమానులకు గుర్తే.

 నేరుగా జాతీయ జట్టులోకే

నేరుగా జాతీయ జట్టులోకే

ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా నేరుగా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడు వసీం అక్రమ్. తన క్రికెట్ కెరీర్‌లో 104 టెస్టులు, 356 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 23.62 యావరేజితో 414 వికెట్లు తీయగా... వన్డేల్లో 23.52 యావరేజితో 502 వికెట్లు పడగొట్టాడు.

 500 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్

500 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్

అంతేకాదు వన్డేల్లో 500 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ వసీం అక్రమే. తన క్రికెట్ కెరీర్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, డీన్ జోన్స్, మార్టిన్ క్రౌనే, సౌరవ్ గంగూలీ, మార్క్ వా లాంటి ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్ మెన్లకు తన బౌలింగ్‌తో ముచ్చెమటలు పోయించాడు.

Story first published: Tuesday, June 5, 2018, 15:47 [IST]
Other articles published on Jun 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+