'విరాట్ కోహ్లీ అని కాదు.. బాబర్ అజామ్ అని పిలవండి'

కరాచీ: ఇటీవలి రోజుల్లో పాకిస్థాన్ క్రికెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైదర్ అలీ. అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో 9 మ్యాచ్‌లాడిన హైదర్.. 158.27 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ నుంచి త్వరలో ప్రపంచస్థాయి బ్యాట్స్‌మెన్ రాబోతున్నాడని ఆ దేశ మాజీలు అంటున్నారు. పాక్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలతో హైదర్‌ను పోలుస్తున్నారు.

ఆరాధ్య క్రికెటర్ స్థాయిని అందుకోలేడు
విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్‌తో తనని పోలుస్తుండటంపై హైదర్ అలీ స్పందించాడు. నన్ను కోహ్లీ అని కాకుండా.. బాబర్ అని పిలవండి అని హైదర్ విజ్ఞప్తి చేసాడు. బాబర్ షాట్ సెలక్షన్ చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ వీడియోలో హైదర్ మాట్లాడుతూ... 'ఏ బ్యాట్స్‌మెన్ కూడా తన ఆరాధ్య క్రికెటర్ స్థాయిని అందుకోలేడు. కానీ అతనిలా ఆడటం మాత్రం నేర్చుకోవచ్చు. వారి ఆటను చూస్తూ.. తనను తాను మెరుగుపరుచుకోగలడు' అని అన్నాడు.

బాబర్ అజామ్ అని పిలవండి
'నాకు బాబర్ అజామ్‌లా ఎదగాలని ఉంది. ప్రజలు అందరూ నన్ను బాబర్ అజామ్ అని పిలిస్తే సంతోషిస్తా. అంతేకాని కోహ్లీ అని కాదు. మ్యాచ్‌లలో బాబర్ షాట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. ప్రజలు నన్ను బాబర్ అని పిలిచేంతవరకు నన్ను నేను మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నా. నేనెప్పటికీ కోహ్లీని కావాలని ఆశించడం లేదు. మారలేను కూడా. కానీ ప్రాక్టీస్‌తో కోహ్లీలా షాట్స్ కొట్టడం మాత్రం నేర్చుకుంటా. నేను హైదర్ అలీ.. హైదర్ అలీగా మాత్రమే మారగలను' అని హైదర్ పేర్కొన్నాడు. బాబర్ అజామ్‌ని గత రెండేళ్లుగా పాక్ అభిమానులు ముద్దుగా విరాట్ కోహ్లీ అని పిలుచుకుంటున్న విషయం తెలిసిందే.

మరో కోహ్లీ
ఓ యూట్యూబ్ వీడియోలో పాక్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. 'హైదర్ అద్భుత నైపుణ్యం ఉన్న ఆటగాడు. తొలి సీజన్‌లోనే తన పేరు మారుమోగేలా ఆడాడు. కాకపోతే అతను తన పెర్ఫామెన్స్‌లో స్థిరత్వం తీసుకురావాలి. బ్యాటింగ్ ఆర్డర్ కూడా మూడో స్థానమే. షాట్లు కొట్టే విషయంలో మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. విధ్వంసకరంగా ఆడే విషయంలో మెరుగుపరుచుకోవాల్సింది ఏం లేదు. కోహ్లీ, బాబర్‌ల విధానాన్ని హైదర్ అనుసరించాలి. హైదర్‌కు కూడా బాబర్,కోహ్లీ మాదిరే నైపుణ్యం ఉంది. కాకపోతే అతను తన ఆటపై ఓ అవగాహనకు వచ్చి భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది' అని తెలిపాడు.

అందరికీ నెగటివ్:
ఇక పీఎస్‌ఎల్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన హైదర్ అలీ 239 పరుగులు చేశాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ లీగ్ తుది దశలో అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ లీగ్ ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ కరోనా లక్షణాలతో బాధపడటంతో.. ఈ టోర్నీలో భాగమైన 128 మందికి పాకిస్థాన్ బోర్డు కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. అందరికి నెగటీవ్ వచ్చిందని కూడా ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications