Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో తొలి కాశ్మీరీ క్రికెటర్: ఎవరీ మంజూర్ దార్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం జరిగిన ప్రతిసారీ కొత్తవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఐపీఎల్ 11వ సీజన్ కోసం బెంగళూరు వేదికగా జరిగిన రెండు రోజుల వేలంలో కొత్త ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. తాజా వేలంలో ఒకప్పుడు రూ.60 రోజు కూలి పొందిన కశ్మీర్‌ యువ ప్లేయర్ మంజూర్‌ దార్‌‌ను పంజాబ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

 తొలి కాశ్మీరీ క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు

తొలి కాశ్మీరీ క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు

దీంతో కాశ్మీర్‌ నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన తొలి క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. మంజూర్ దార్ ఎంపిక కాశ్మీర్‌ యువతలో ఆనందనాన్ని నింపింది. ముఖ్యంగా మంజూర్ దార్ సొంత గ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 100 మీటర్ల దూరం సిక్సులు బాదడంలో మంజూర్ దార్ పెట్టింది పేరు. అలాంటి మంజూర్ దార్‌ది చాలా పెద్ద కుటుంబం. నలుగురు చెల్లెల్లు, ముగ్గురు తమ్ముళ్లతో కుటుంబ బాధ్యత తనపై ఉన్నప్పటికీ క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఒకవైపు సెక్యూరిటీ గార్డుగా రాత్రి వేళలో పనిచేస్తూ పగలు స్థానిక కోచ్‌ సాయంతో క్లబ్‌ క్రికెట్‌ ఆడేవాడు. ఇలా 2008 నుంచి 2012 వరకు క్లబ్ క్రికెట్ ఆడాడు.

 2017లో కాశ్మీర్‌ జట్టు తరుపున తొలి మ్యాచ్‌

2017లో కాశ్మీర్‌ జట్టు తరుపున తొలి మ్యాచ్‌

ఆ తర్వాత 2017లో కాశ్మీర్‌ జట్టు తరుపున తొలి మ్యాచ్‌ ఆడాడు. బరిలోకి దిగిన ప్రతిసారి అలవోకగా సిక్సులు బాదేవాడు. దీంతో మంజూర్ దార్ అందరితో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు పొందాడు. గతేడాది కాశ్మీర్ తరుపున 9 టీ20లు, నాలుగు లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు. అంతకముందు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన పర్వేజ్‌ రసూల్‌, మంజూర్‌ దార్‌లే కశ్మీర్‌ తరపున వేలంలో పాల్గొన్నారు. అయితే ప్రాంఛైజీలు మాత్రం మంజూర్ దార్‌ను కొనుగోలు చేయడం విశేషం. ఐపీఎల్ వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మంజూర్ దార్‌ని కొనుగోలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

 ప్రీతిజింతాకు ధన్యవాదాలు

ప్రీతిజింతాకు ధన్యవాదాలు

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో మంజూర్ దార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన పంజాబ్‌ యజమాని ప్రీతిజింతాకు ధన్యవాదాలు తెలిపాడు. 'నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వచ్చా.. ఇప్పుడు ఐపీఎల్‌ వేలంలో ఎంపికవడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు రూ.60 కూలీకి పని చేసానని, క్రికెట్‌ ఆడే రోజుల్లో తనకి కనీసం షూ కూడా లేవు' అని ఈ సందర్భంగా అలనాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

 యువీతో డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకునే అవకాశం

యువీతో డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకునే అవకాశం

'తన అభిమాన క్రికెటర్‌ యువరాజ్‌తో డ్రెస్సింగ్‌ రూమ్ పంచుకునే అవకాశం రావడం మరింత సంతోషాన్ని ఇస్తుంది. పంజాబ్ జట్టుకు ఎంపిక అయిన తర్వాత మా అమ్మను సుమారు 30 వేల మంది కలిసి అభినందించారు. నిజంగా ఇంతటి ప్రేమను అందుకోవడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. 'కొత్త ఇంటిని ప్రారంభించి మూడేళ్లు అవుతుందని, దానికి కనీసం డోర్స్‌, కిటీకీలు కూడా లేవని ఇప్పుడు ఈ డబ్బుతో అది పూర్తి చేస్తానని, మా చెల్లెల్లు, తమ్ముళ్లను బాగా చదివిస్తాను' అని చెప్పుకొచ్చాడు. తన తల్లి ఆరోగ్యం సైతం బాలేదని, ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తానని మంజూర్ దార్ ఈ సందర్భంగా వివరించాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

వేలం అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు:

1. అక్షర్ పటేల్ (రూ.6.75 కోట్లు - Retained)

2. అశ్విన్ (రూ.7.6 కోట్లు)

3. యువరాజ్ సింగ్ (రూ.2 కోట్లు)

4. కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు)

5. కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు)

6. డేవిడ్ మిల్లర్ (రూ.3 కోట్లు - RTM)

7. ఆరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు)

8. మార్కస్ స్టాయినిస్ (రూ.6.2 కోట్లు-RTM)

9. మయాంక్ అగర్వాల్ (రూ.కోటి)

10. అంకిత్‌సింగ్ రాజ్‌పుత్ (రూ.3 కోట్లు)

11. మనోజ్ తివారీ (రూ.కోటి)

12. మోహిత్ శర్మ (రూ.2.4 కోట్లు- RTM)

13. ముజీబ్ జర్దాన్ (రూ.4 కోట్లు)

14. బరిందర్ శరణ్ (రూ.2.2 కోట్లు)

15. అండ్రూ టై (రూ.7.2 కోట్లు)

16. అక్షదీప్ నాథ్ (రూ.కోటి)

17. బెన్ డ్వార్షుయిస్ (రూ.1.4 కోట్లు)

18. ప్ర‌దీప్ సాహు (రూ.20 ల‌క్ష‌లు)

19. మ‌యాంక్ దాగార్ (రూ.20 ల‌క్ష‌లు)

20. క్రిస్ గేల్ (రూ.2 కోట్లు)

21. మంజూర్ దార్ (రూ.20 ల‌క్ష‌లు)

Story first published: Tuesday, January 30, 2018, 18:27 [IST]
Other articles published on Jan 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+