ఆ పిలుపు కోసం పేరు మార్చుకోవాలనుకున్నా!: సచిన్‌పై సెహ్వాగ్ ఆసక్తికరం

న్యూఢిల్లీ: బీసీసీఐ పెద్దలతో లోపాయికారీ ఒప్పందాలు లేనందువల్లే తాను కోచ్ పదవికి ఎంపిక కాలేదంటూ టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడే సెహ్వాగ్ తాజాగా క్రికెట్ గాడ్‌గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టెండూల్కర్ సాధించిన రికార్డులను ప్రశంసిస్తూ.. తాను కూడా సచిన్ అని పేరు మార్చుకోవాలనుకున్నానని సెహ్వాగ్ ఛమత్కరించాడు. 'సచిన్ సాధించిన రికార్డులు అద్భుతం. నేను వాటికి ఏమాత్రం దగ్గర్లో లేను. రికార్డులు సాధించడానికి పుట్టాడు కాబట్టే క్రికెట్ దేవుడిగా కొనియాడబడుతున్నారు. అలాంటి పిలుపును ఎవరు మాత్రం కాదనుకుంటారు. అందుకే నా పేరు కూడా సచిన్ అని మార్చుకోవాలనుకున్నా' అంటూ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Want to change my name to 'God' Sachin Tendulkar, says Virender Sehwag

ఇక ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సైతం సెహ్వాగ్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ క్రికెట్ లో మరో సచిన్ వస్తాడనుకోలేదని, కానీ కోహ్లి ఆ అభిప్రాయాన్ని మార్చేశాడని అన్నారు. సచిన్ రికార్డులను కోహ్లి అధిగమిస్తాడని భావిస్తున్నట్లు తెలిపారు. కోహ్లి రూపంలో మరో సచిన్ ప్రపంచానికి పరిచయం అయ్యాడని అన్నారు.

Story first published: Saturday, September 16, 2017, 15:43 [IST]
Other articles published on Sep 16, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి