INDvsAUS : భారత్‌కు కలిసిరాని వాంఖడే.. ఆసీస్ చేతిలో ఓటమి తప్పదా?

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డేకు అంతా సిద్ధం అయింది. టెస్టు సిరీస్‌ను 2-1తో భారత్ నెగ్గినా.. వన్డేల్లో అదే ఫలితం రిపీట్ అవుతుందని గట్టిగా చెప్పలేం. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన తల్లి మరణంతో ఈ సిరీస్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. దీంతో వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఆస్ట్రేలియా జట్టు పగ్గాలు అందించారు.
ఇక బంధువుల పెళ్లి కారణంగా రోహిత్ శర్మ కూడా జట్టుకు దూరం అవడంతో.. హార్దిక్ పాండ్యాకు టీమిండియా సారధ్య బాధ్యతలు అప్పగించడం జరిగింది.

రెండు జట్లలో కొత్త ముఖాలు..
రెండు జట్లలో టెస్టు స్పెషలిస్టుల స్థానంలో కొత్తవాళ్లు వచ్చారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టొయినిస్ తదితరులు ఆసీస్ క్యాంప్‌లో చేరగా.. హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్ వంటి వాళ్లు భారత జట్టుతో చేరారు. ఈ రెండు జట్లు తొలి మ్యాచ్‌లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడతాయి. ఇక్కడ భారత్‌పై ఆస్ట్రేలియా రికార్డు మెరుగ్గా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగు సార్లు వాంఖడేలో తలపడగా.. వీటిలో మూడు సార్లు విజయం ఆసీస్‌నే వరించింది. చివరగా 2020లో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓపెనర్లు ఫించ్, వార్నర్ సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ గెలిచింది.

బ్యాటింగ్ పిచ్ ఏం కాదు!
వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు 22 అంతర్జాతీయ వన్డే మ్యాచులు జరగ్గా.. వీటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 11, ఛేజ్ చేసిన జట్టు 11 సార్లు గెలిచాయి. అంతేకాదు, ఈ స్టేడియంలో అంత భారీ స్కోర్లు నమోదవడం కూడా చాలా అరుదు. ఇంతకుముందు 2015లో సౌతాఫ్రికా జట్టు చేసిన 438 పరుగులు ఇక్కడ అత్యధిక స్కోరు. అయితే వాంఖడేలో యావరేజ్ స్కోరు 250 కన్నా తక్కువే కావడం గమనార్హం. చివరగా ఇక్కడ జరిగిన వన్డే మ్యాచ్‌లో కూడా 256 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించేసింది.

పిచ్, వాతావరణం ఎలా ఉందంటే?
ఇక్కడి పిచ్ మొదట్లో పేసర్లకు కొంత సహకారం అందించడం ఆనవాయితీ. ఆ తర్వాత మ్యాచ్ జరిగే కొద్దీ స్పిన్నర్లకు మంచి టర్న్ దొరుకుతుంది. దీంతో టీమిండియాలో చాహల్, జడేజా కీలకం కానున్నారు. అదే సమయంలో బ్యాటర్లకు కూడా ఇక్కడ మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగే వన్డేలో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని అంచనా. అలాగే మ్యాచ్ జరిగే రోజు ఉదయం ఇక్క చిన్నపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. కానీ దీని వల్ల మ్యాచ్‌పై పెద్దగా ప్రభావం ఉండబోదని సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications