ICC Rankings: టీ20ల్లో టాప్ బౌలర్‌గా స్పిన్ మాంత్రికుడు.. టాప్‌టెన్‌లో లేని భారత బౌలర్లు!

శ్రీలంక స్పిన్ మాంత్రికుడు వానిందు హసరంగ మరోసారి టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బౌలర్ల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్ కనబరుస్తున్న హసరంగ.. శ్రీలంక సాధించిన ఎన్నో విజయాల్లో కేవలం బంతితోనే కాదు, బ్యాటుతో కూడా రాణించాడు. ఈ క్రమంలోనే 2021 తర్వాత మళ్లీ టీ20 బౌలర్ల జాబితాలో టాప్ ర్యాంక్ సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. లేదంటే ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా దూసుకుపోయేవాడే.

ప్రపంచకప్‌లో అదరగొట్టిన హసరంగ..
ఆసియా కప్‌లో శ్రీలంక విజయాల్లో కీలక పాత్ర పోషించిన వానిందు హసరంగ.. ప్రపంచకప్‌లో కూడా కీలక సమయాల్లో రాణించాడు. పెద్దగా స్పిన్‌కు సహకరించని పిచ్‌లపై కూడా సత్తా చాటి, ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ లెగ్ స్పిన్నర్‌లలో ఒకడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో 15 వికెట్లు తన ఖాతాలో వేసుకొని ప్రస్తుతం ప్రపంచకప్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్‌పై 3/13, ఇంగ్లండ్‌పై 2/23 గణాంకాలతో అదరగొట్టాడు.

రషీద్ ఖాన్‌ను గద్దె దించేశాడు
ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం అవడానికి ముందు ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అత్యుత్తమ టీ20 బౌలర్‌గా ఉన్నాడు. అయితే ప్రపంచకప్ ఆరంభంలో అదరగొట్టిన ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. హాజిల్‌వుడ్‌ను గద్దె దించి, పొట్టి ఫార్మాట్‌లో బెస్ట్ బౌలర్‌గా అగ్రస్థానాన్ని తను ఆక్రమించాడు. ఇప్పుడు హసరంగ దూసుకొచ్చి, రషీద్‌ను వెనక్కు నెట్టి తను ఆ సింహాసనంపై కూర్చున్నాడు. హసరంగ చివరగా 2021 నవంబరులో టాప్ ర్యాంకు సాధించాడు. ప్రస్తుత టాప్ టెన్ బౌలర్ల జాబితాలో ఒక్క భారత ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం.

మిగతా ర్యాంకింగ్స్‌లో..
ఇక బ్యాటర్ల విషయానికొస్తే టీమిండియా 'మిస్టర్ 360 డిగ్రీస్' సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను ఇప్పుడప్పుడే ఆ సీటును ఎవరికీ ఇచ్చేలా కనిపించడం లేదు. శ్రీలంక స్టార్ ధనంజయ డిసిల్వ టాప్ టెన్‌లో ప్రవేశించాడు. టీమిండియా మాజీ సారధి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 11వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే స్టార్ షాన్ విలియమ్స్ కూడా టాప్ టెన్‌లోకి ప్రవేశించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications