Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాండరర్స్ 'పిచ్’కు దారుణమైన రేటింగ్

Wanderers pitch rated 'poor' by ICC

హైదరాబాద్: భారత్‌, దక్షిణాఫ్రికా మూడో టెస్టుకు వేదికైన వాండరర్స్‌ మైదానంలోని పిచ్‌ను ఐసీసీ ఇటీవలే పరిశీలించింది. అస్థిర బౌన్స్‌ కారణంగా బంతి అనేకసార్లు బ్యాట్స్‌మెన్‌ శరీరాలకు తగలడంతో పిచ్‌పై ప్రత్యేక శ్రద్ధతో పరీక్ష చేపట్టింది. ఇందులో పిచ్‌కు దారుణమైన రేటింగ్‌ను ఆపాదించింది. ఒక్క రెండు పాయింట్లు ఎక్కువ ఇచ్చి ఉంటే మరో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి సస్పెన్షన్‌కు గురి కావలసి వచ్చేది.

మూడో టెస్టు గాయాలు:
బుమ్రా బౌన్సర్‌ ఎల్గర్‌ హెల్మెట్‌ను తగలడంతో ఆటను కొనసాగించడం ప్రమాదకరమని భావించిన అంపైర్లు మూడో రోజు ఆటను నిర్ణీత సమయం కంటే ముందే ముగించారు కూడా. అతనితో పాటు విరాట్ కోహ్లీ వేలికి, ఇంకొంత మంది బౌలర్లకి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐసీసీ.. వాండరర్స్‌ పిచ్‌ బాగా లేదని తేల్చింది.

ఐసీసీ పరిశీలన:
''వాండరర్స్‌ పిచ్‌ 'పేలవం'గా ఉన్నట్లు ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ రేటింగ్‌ ఇచ్చాడు. దీంతో నిబంధనల ప్రకారం ఆ పిచ్‌కు మూడు అయోగ్యతా పాయింట్లు లభించాయి'' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. పిచ్‌ నాణ్యత సగటు కన్నా తక్కువగా ఉందని మ్యాచ్‌ రిఫరీ తేలిస్తే ఒక అయోగ్యతా పాయింటు, పేలవంగా ఉందని పేర్కొంటే మూడు పాయింట్లు, పిచ్‌ పనికిరాదని తేలిస్తే ఐదు పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లు ఐదేళ్లపాటు లెక్కలో ఉంటాయి. ఈ సమయంలో అయోగ్యతా పాయింట్లు ఐదుకు చేరిన పిచ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వకుండా ఏడాది నిషేధం విధిస్తారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 9:28 [IST]
Other articles published on Jan 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+