For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు క్రికెట్‌కు బ్రేక్‌ ఇచ్చిన వహాబ్‌ రియాజ్.. ఇక గుడ్‌ బై చెప్పినట్లేనా?

Wahab Riaz takes indefinite break from red-ball cricket

కరాచీ: పరిమిత ఓవర్ల ఫార్మాట్లపై దృష్టి పెట్టడానికి పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వహాబ్ రియాజ్ టెస్టు క్రికెట్ నుండి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే ప్రస్తుతానికి వన్డే, టీ20 క్రికెట్‌పై దృష్టి పెడతానని రియాజ్ చెప్పాడు. అంతేకాదు శనివారం నుండి ప్రారంభమయ్యే క్వాయిడ్-ఎ-అజామ్ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వహాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి:

'మా కుటుంబ సభ్యులు, పాక్ బోర్డుతో చర్చలు జరిపా. ఇక టెస్టులకు నిరవధికంగా విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకే టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా. నా దేశం కోసం పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టా. ఇది చాలా కఠిన నిర్ణయమే. అయినా బోర్డు సభ్యుల మద్దతును అభినందిస్తున్నా' అని రియాజ్‌ తన ట్వీటర్‌ ఖాతాలో రాసుకొచ్చాడు.

గుడ్‌ బై చెప్పినట్లేనా?:

గుడ్‌ బై చెప్పినట్లేనా?:

టెస్టు క్రికెట్‌కు బ్రేక్‌ ఇచ్చిన వహాబ్‌ రియాజ్ ఇంతకు టెస్టు కెరీర్‌కు గుడ్‌ బై చెప్పాడో లేదో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే గుడ్‌ బై చెప్పినట్లే అని పలువురు అంటున్నారు. రియాజ్ చివరిసారిగా 2018 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో పాల్గొన్నాడు. 2010లో టెస్ట్‌లోకి అడుగుపెట్టిన రియాజ్ పాకిస్తాన్ తరఫున 27 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 34 ఏళ్ల వహాబ్ రియాజ్ 27 టెస్ట్ మ్యాచుల్లో 3.42 ఎకానమీతో 83 వికెట్లు తీసాడు. ఐదు వికెట్లు రెండు సార్లు తీసాడు. 5/63 ఇది రియాజ్ టెస్టుల్లో బెస్ట్ గణాంకాలు. అంతేకాదు బ్యాటుతో 2864 పరుగులు కూడా చేసాడు. 87 వన్డేల్లో 113 వికెట్లు.. 27టీ20ల్లో 28 వికెట్లు తీసాడు. 3903, 723 పరుగులు కూడా చేసాడు.

పాకిస్తాన్‌ క్రికెట్‌లో అలజడి:

పాకిస్తాన్‌ క్రికెట్‌లో అలజడి:

ఇటీవల పాక్ స్టార్ పేసర్‌ మహ్మద్‌ అమిర్‌ టెస్టు కెరీర్‌కు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వహాబ్‌ రియాజ్‌కు అమిర్‌ బాటలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. 'నీకు చాలా కెరీర్ ఉంది. కష్టకాలంలో ఉన్న పాక్‌ క్రికెట్‌ జట్టుకు అండగా ఉండాల్సింది పోయి రిటైర్మెంట్‌ ఇస్తున్నావ్. నీ తర్వాత రియాజే టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడా' మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మండిపడ్డాడు. ఇప్పుడు రియాజ్‌ చేసిన ట్వీట్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌లో అలజడి రేపుతోంది.

Story first published: Friday, September 13, 2019, 14:15 [IST]
Other articles published on Sep 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+